తెలంగాణ

telangana

గ్యాస్ ట్యాంకర్​ పేలి భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. గ్రామాలకు వ్యాపించిన మంటలు!

By

Published : Feb 17, 2023, 12:15 PM IST

రాజస్థాన్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్​ ట్యాంకర్​, ఓ ట్రక్కును ఢీకొట్టగా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే కాలి బుడిదవ్వగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో పాటుగా చాలా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘోర ప్రమాదం అజ్మేర్ జిల్లాలో జరిగింది.

gas tanker truck accident
gas tanker truck accident

రాజస్థాన్​లో ఓ గ్యాస్​ ట్యాంకర్.. ట్రక్కును ఢీకొట్టడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గ్యాస్​ ట్యాంకర్​ పేలడం వల్ల దాదాపు 500 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని చాలా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘోర ప్రమాదం అజ్మేర్​ జిల్లాలోని 8వ నంబర్​ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి.. మంటలను అదుపు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అజ్మేర్ జిల్లా బీవర్​ ప్రాంతంలోని రాణిబాగ్​ రిసార్ట్​కు సమీపంలో ఓ గ్యాస్​ ట్యాంకర్.. ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో గ్యాస్​ ట్యాంకర్​ పేలగా.. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్​లతో పాటుగా మరో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ భారీ పేలుడుతో హైవే మీదుగా వెళ్తున్న పలు వాహనాలు అగ్నికి దగ్ధమయ్యాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. మంటలు హైవేకు పక్కనే ఉన్న గరీబ్​ నవాబ్​ కాలనీ, మిశ్రీపుర్​ గ్రామాలకు కూడా వ్యాపించాయి. దీంతో కొన్ని ఇళ్లు, దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు కిలోమీటరు వరకు ఈ పేలుడు శబ్ధం వినిపించిందని.. మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ చునారామ్​ జాట్​ వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి
హరియాణాలోని భివానీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఓ కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారుతో పాటుగా కాలి బూడిదై గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు. వారిని ఎవరో కాళ్లుచేతులు కట్టి కారుతో పాటుగా నిప్పంటించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్​లోని గోపాల్​గఢ్​ ప్రాంతానికి చెందిన జునైద్​, నజీర్ అనే ఇద్దరు యువకులను.. 10 మంది వ్యక్తులు బలవంతంగా కారులో వచ్చి ఎత్తుకెళ్లినట్లు వారి బంధువులు కేసు నమోదు చేశారు. దీంతో హరియాణా పోలీసులు మృతులు జునైద్, నజీర్​లుగా భావిస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఇద్దరు యువకులు

ABOUT THE AUTHOR

...view details