తెలంగాణ

telangana

యువతిపై దారుణం- టాలీవుడ్​ ఆఫర్ ఇప్పిస్తానని నమ్మించి కారులో గ్యాంగ్​రేప్​!

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 9:20 PM IST

Updated : Dec 6, 2023, 9:40 PM IST

Gang Rape In Kolkata : టాలీవుడ్​లో అవకాశం కల్పిస్తానని నమ్మించి ఓ యువతిపై గ్యాంగ్​ రేప్​ చేశారు ఇద్దరు వ్యక్తులు. బంగాల్​లో జరిగిందీ ఘటన.

Gang Rape In Kolkata
Gang Rape In Kolkata

Gang Rape In Kolkata :బంగాల్​లోని కోల్​కతాలో కారులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టాలీవుడ్​లో అవకాశం కల్పిస్తానని నమ్మించి ప్రధాన నిందితుడు అఘాయిత్యానికి పాల్పడాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం-కోల్​కతాలోని బెహలాకు చెందిన యువకుడుతో బాధిత యువతికి కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. బంగాల్ చిత్రపరిశ్రమలో ఓ ప్రముఖ వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు నిందితుడు. టాలీవుడ్​ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తానని నమ్మించి బాధితురాలితో సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ నిందితుడు ఆ బాధితురాలితో సినీ పరిశ్రమలో అవకాశం కల్పించలేకపోయాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం బెడిసికొట్టింది.

అయితే టాలీవుడ్​లో అవకాశాల కల్పించే విషయమై మాట్లాడేందుకు సోమవారం అర్థరాత్రి పోలీస్​స్టేషన్ వద్దకు రావాలని బాధితురాలిని నిందితుడు పిలిపించాడు. అక్కడికి వెళ్లిన యువతిని కారులో ఎక్కించుకున్నాడు నిందితుడు. ఆ తర్వాత ఎవరూలేని ప్రాంతానికి తీసకువెళ్లాడు. ఇదే అదనుగా తీసుకున్న నిందితుడు, కారు డ్రైవర్​ బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా కారులోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం బాధితురాలు జరిగినదంతా తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు కోల్​కతా డీసీ అరిష్ బిలాల్ వెల్లడించారు. ఘటనాస్థలిలోని సీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని చెప్పారు. నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిపారు.

యువతిపై అత్యాచారం
కొన్నాళ్ల క్రితం కర్ణాటకలో నలుగురు కామాంధులు కదులుతున్న కారులో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పార్క్​లో స్నేహితుడితో మాట్లాడుతున్న యువతిని కారులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు నిందితులు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వార్తను చదివేందుకు ఈలింక్​ పై క్లిక్ చేయండి.

స్నేహితులతో కలిసి సోదరిపై అత్యాచారం- ఆపై కిరాతకంగా హత్య- ఆ విషయంలో నిలదీసినందుకే!

ప్రేమించడం లేదని యువతి కిడ్నాప్.. పాతకక్షలతో నడిరోడ్డుపై హత్య

Last Updated : Dec 6, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details