తెలంగాణ

telangana

వెయ్యి మందికి ఉచితంగా శ్రీరాముడి టాటూలు- భక్తిని చాటుకుంటున్న ఆర్టిస్ట్

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 11:00 AM IST

Free Ram Tattoo On Hand : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఉచితంగా శ్రీరాముని పచ్చబొట్లను వేస్తున్నాడు ఓ యువకుడు. మహారాష్ట్ర నాగ్​పుర్​కు చెందిన రాజేంద్ర 1,001 మంది ఉచితంగా టాటూ వేయాలని సంకల్పించుకున్నాడు.

Etv Bharat
Etv Bharat

వెయ్యి మందికి ఉచితంగా శ్రీరాముడి టాటూలు

Free Ram Tattoo On Hand : మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఓ యువకుడు శ్రీరాముడిపై భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నాడు. టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు తన దగ్గరకు వచ్చే భక్తులకు ఉచితంగా రాముడి పచ్చబొట్లు వేస్తున్నాడు. వివిధ రూపాల్లోని రాముడి చిత్రాలను అందంగా చేతులు, ఛాతి, భుజాలపై డిజైన్‌ చేస్తున్నాడు. పచ్చబొట్లు పొడిపించుకునేందుకు స్థానికులు ఆ టాటూ షాప్‌నకు భారీగా తరలివస్తున్నారు. చాలా సమయం లైన్లలో నిల్చుని మరీ టాటూలు వేయించుకుంటున్నారు.

టాటూ వేస్తున్న హృతిక్​

22 ఏళ్ల హృతిక్ రాజేంద్ర దారోడే వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్. అతడికి శ్రీరాముడంటే ఎనలేని భక్తి. ప్రతి ఏడాది శ్రీరామనవమికి ఏదో కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని వినూత్నంగా టాటూలు వేయాలని అనుకున్నాడు. సుమారు 101 మందికి ఉచితంగా శ్రీరాముడి పచ్చబొట్లను వేయాలని తీర్మానించుకున్నాడు. ఆ తర్వాత మంచి స్పందన రావడం వల్ల ఈ సంఖ్యను 1,001కు పెంచాడు. ఇప్పటివరకు సుమారు 350 మందికి టాటూలను వేశాడు హృతిక్​. రోజుకు సుమారు 60 మందికి టాటూలను వేస్తున్నానని, జనవరి 22 వరకు తన లక్ష్యాన్ని పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి తండ్రి రాజేంద్ర, సోదరి రోషిణి, ఇతర స్నేహితులు సైతం సాయం చేస్తున్నారు. ఒక్కో టాటూకు హృతిక్​కు రూ.350 ఖర్చు అవుతుంది. వెయ్యి మందికి సుమారు రూ.మూడున్నర లక్షల ఖర్చు అవుతోంది. కానీ ఈ మొత్తాన్ని అతడి కుటుంబసభ్యులు భరించనున్నారు.

చేతిపై రామ్ టాటూ

"ఎన్నో ఏళ్ల తర్వాత కోట్లాది మంది హిందువుల కల నెరవేరబోతుంది. అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఇది నాకు, కోట్లాది మంది హిందువులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ వేడుక నేపథ్యంలో నా కళ ద్వారా సేవ చేస్తున్నాను."
--హృతిక్ రాజేంద్ర దారోడే, టాటూ ఆర్టిస్ట్​

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఇదే!
Ayodhya Ram Mandir Opening : అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12గంటల 20 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

టాటూ వేస్తున్న హృతిక్​

25 సెకన్లలో రాముడి విగ్రహంతో గర్భగుడికి మోదీ- అద్భుత ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ

అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!

ABOUT THE AUTHOR

...view details