తెలంగాణ

telangana

రాత్రంతా ఆన్​లో గ్యాస్​ హీటర్​.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

By

Published : Jan 8, 2023, 10:21 PM IST

రాత్రంతా గ్యాస్​ హీటర్​ ఆన్​లో ఉండడం వల్ల ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హీటర్ నుంచి గ్యాస్​ లీక్ అవ్వడమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

four people died due to suffocation
ఓకే కుటుంబంలో నలుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో విషాదం నెలకొంది. రాత్రంతా గ్యాస్​ హీటర్​ ఆన్​లో ఉండడం వల్ల ఓ కుటుంబం మృతి చెందింది. పాల వ్యాపారి వెళ్లి తలుపు తట్టగా అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సీతాపుర్​లో ఆసిఫ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి జీవిస్తున్నాడు. ఆసిఫ్​ స్థానికంగా ఉండే ఓ మదర్సాలో క్లర్క్​గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే ఆదివారం ఉదయం పాల వ్యాపారి వెళ్లి వారింటి తలుపు తట్టగా.. లోపల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పలగకొట్టి చూడగా.. వారంతా నిద్రలోనే మృతి చెందినట్లు గుర్తించారు. "శనివారం రాత్రి ఆసిఫ్ కుటుంబం గ్యాస్​ హీటర్​ను ఆన్​ చేసి నిద్రించారు. ఆ సమయంలో హీటర్​ నుంచి గ్యాస్ లీక్​ అయ్యింది. అదే సమయంలో నిద్రలో ఉన్న వారు ఆ గాలిని పీల్చుకున్నారు. దీంతో వారంతా మరణించారు" అని సీఓ బిశ్వా అభిషేక్​ ప్రతాప్ వెల్లడించారు.

బస్సులో ఒక్కసారిగా మంటలు.. 60 మంది సేఫ్​
చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో బైక్​పై వెళ్తున్న ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వ బస్సు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న బైక్ బస్సు కిందకు వెళ్లింది. దీంతో ఒక్కసారిగా బస్సు కింద మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 60 మందికి పైగా ప్రయాణికులు మంటలను చూసి వెంటనే బస్‌లో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అదే గ్రామానికి చెందిన సైనికుడు సుందరేశన్, యువరైతు గణేశన్​గా గుర్తించారు.

మంటల్లో దగ్ధమైన బస్సు

ABOUT THE AUTHOR

...view details