తెలంగాణ

telangana

పరువు పోతుందని విషం తాగిన కుటుంబం.. ఐదుగురు మృతి

By

Published : Nov 9, 2021, 4:28 PM IST

సమాజంలో పరువు పోతుందన్న భయంతో ఓ కుటుంబం విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని కోలార్​లో ఈ ఘటన జరిగింది.

consuming Poison
విషం తాగిన కుటుంబం

చిన్నారి అపహరణ కేసులో భాగంగా.. పోలీసుల విచారణలో తమ పరువు పోతుందని భావించిన ఓ కుటుంబం ప్రాణాలు తీసుకుంది. కుటుంబంలోని మొత్తం ఐదుగురు విషం తాగి మరణించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ఇదే జరిగింది..

కర్ణాటక కోలార్​కు చెందిన 20 ఏళ్ల యువతి.. ఓ యువకుడిని ప్రేమించింది. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత యువతి ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపేందుకు ఇష్టపడని దంపతులు.. పుష్ప(35) అనే మహిళకు బిడ్డను అప్పగించారు. కొద్దిరోజుల తర్వాత తన బిడ్డను తీసుకెళ్లేందుకు పుష్ప దగ్గరకు వెళ్లింది ఆ యువతి. ఈ విషయంపై పుష్పను అడగ్గా.. తనకు ఎవరు, ఏ బిడ్డనూ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డను తిరిగివ్వాలని అభ్యర్థించింది.

ఈ పూర్తి వ్యవహారాన్ని.. చిన్నారి అపహరణ కేసుగా నమోదుచేసుకున్నారు పోలీసులు. పుష్ప, ఆమె కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. పోలీసులు విచారించడం వల్ల సమాజంలో తమ పరువు పోతుందని భావించిన పుష్ప కుటుంబం.. బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోని ఐదుగురు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

మృతిచెందిన వారిని మునియప్ప(70), నారాయణమ్మ(65), బాబు(45), పుష్ప(33), గంగోత్రి(17)గా గుర్తించినట్లు కోలార్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు తెలిపారు.

ఇదీ చూడండి:అన్నదమ్ములిద్దరూ బావి గోడపై కూర్చొని.. అంతలోనే..

ABOUT THE AUTHOR

...view details