తెలంగాణ

telangana

బిర్యానీ కోసం గొడవ.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త.. ఇద్దరూ మృతి

By

Published : Nov 9, 2022, 1:42 PM IST

బిర్యానీ కావాలని అడిగిన భార్యపై.. కోపంతో భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే భార్య, భర్తను హత్తుకోవడం వల్ల ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

fight for biryani dead husband and wife
బిర్యానీ కోసం గొడవపడి మృతి చెందిన దంపతులు

బిర్యానీ కోసం జరిగిన గొడవ.. వృద్ధ దంపతుల్ని బలిగొంది. చెన్నైలో జరిగిందీ ఘటన. కరుణాకరన్(75), పద్మావతి(66).. చెన్నైలోని అయినవరంలో నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. కరుణాకరన్, పద్మావతికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కరుణాకరన్ నవంబర్ 7న బిర్యానీ పొట్లం కొనుక్కున్నాడు. తన భార్యకు పెట్టకుండా ఒక్కడే తిన్నాడు. అది చూసిన భార్య తనకు కూడా బిర్యానీ కావాలని అడిగింది. దీంతో ఇద్దరూ వాదించుకుంటూ గొడవ పెట్టుకున్నారు. కోపంతో ఉన్న భర్త, భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, భర్తను హత్తుకోవడం వల్ల ఇద్దరూ మంటల్లో కాలిపోయారు.

ఇంటి నుంచి అరుపులు వినిపిస్తూ, పొగలు రావడం చూసిన ఇరుగుపొరుగువారు మంటలను ఆపేందుకు నీళ్లు పోశారు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సగం కాలిపోయిన దంపతులను కిలపక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details