తెలంగాణ

telangana

కోపంతో కోడలి చెయ్యి నరికిన మామ... అతికించిన వైద్యులు

By

Published : Nov 18, 2021, 9:40 PM IST

మధ్యప్రదేశ్​లోని విదీశా జిల్లాలో (Madhya Pradesh News) దారుణ ఘటన వెలుగు చూసింది. కోడలితో వాదన తారస్థాయికి చేరడం వల్ల ఓ వ్యక్తి ఆమె చెయ్యిని నరికేశాడు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆమె చేయ్యిని అతికించారు.

madhya pradesh news
కోడలి చెయ్యి నరికేసిన మామ

కుటుంబ కలహాల కారణంగా కోడలితో వాదనకు దిగిన మామ.. కత్తితో ఆమె చెయ్యి నరికేశాడు. మధ్యప్రదేశ్​లోని విదీశాలో ఈనెల 11న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా (Madhya Pradesh News) వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

ఈనెల 11న బాధితురాలు, నిందితుడికి మధ్య కుటుంబ విషయంపై (Madhya Pradesh News) వాదన జరిగింది. అది తారస్థాయికి వెళ్లేసరికి నిందితుడు కత్తితో ఆమె చెయ్యి నరికేశాడు. బాధితురాలిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె చెయ్యికి శస్త్రచికిత్స చేశారు. 9 గంటల పాటు శ్రమించి మళ్లీ ఆ చెయ్యిని అతికించారు. అనంతరం ఆమెను ఐసీయూకి తరలించారు.

బాధితురాలిని ఆసుపత్రికి తీసుకురావడం మరింత ఆలస్యమై ఉంటే ఆమె చేతిని అతికించడం సాధ్యమయ్యేది కాదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఇదీ చూడండి :సింహాన్ని 'సెల్ఫీ గ్యాంగ్​' రౌండప్ చేస్తే...

ABOUT THE AUTHOR

...view details