తెలంగాణ

telangana

covid third wave india: మూడో దశ వ్యాప్తికి అదే కీలకం!

By

Published : Sep 18, 2021, 10:45 AM IST

కొవిడ్​ రెండో దశతో దేశం విలవిల్లాడింది. ఆ చేదు అనుభవాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో మూడో దశ వ్యాప్తిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి(India third wave prediction). దేశంలో మూడో దశ ఎప్పుడు వస్తుందనే అంశంపైనే ఇప్పుడు అసలు చర్చంతా. పండగ సీజన్​లో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించకపోయినా.. ఈలోపు కొత్త వేరియంట్​ ఏదైనా ఉద్భవించినా.. మూడో దశ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.​

covid third wave india
కొవిడ్​ మూడో దశ

భారత్​లో కొవిడ్​ మూడో దశ విజృంభణపై భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఆరోగ్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు(covid third wave India). ఈ పండగ సీజన్​లో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటిస్తారా? లేదా? అన్న అంశంపైనే దేశంలో థర్డ్​ వేవ్​ ఆధారపడి ఉందన్నారు(india third wave prediction). ఎట్టిపరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించకూడదని సూచించారు.

ఈ క్రమంలో కొత్త వేరియంట్​ ఉద్భవిస్తే.. మూడో దశ వ్యాప్తికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. పండగ సీజన్​లో రద్దీ ప్రాంతాలు కొత్త వేరియంట్​ విజృంభణకు సూపర్​ స్ప్రెడర్​ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

"సామాజిక, మతపరమైన సమావేశాలతో డెల్టా వైరస్​ వ్యాప్తి చెందే అవకాశముంది. ఇప్పటివరకు కొవిడ్​ బారిన పడని వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేసి, సమావేశాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కొవిడ్​ నిబంధనలను పాటించాలి. ప్రస్తుతానికి దేశంలో కొవిడ్​ కేసులు తగ్గుతున్నాయి. ఇది మంచి విషయమే. కానీ రానున్న పండగ సీజన్​తో జాగ్రత్తగా ఉండాలి. భారీ సభలు, సూపర్​-స్పెడర్​ ఈవెంట్లు.. థర్డ్​ వేవ్​ విజృంభణకు కారణమయ్యే అవకాశముంది. దేశంలో మెరుగైన స్థితిలో ఉండాలంటే రానున్న 2-3 నెలలు అత్యంత కీలకం."

--- రణ్​దీప్​ గులేరియా, ఎయిమ్స్​ డైరక్టర్​.

మరోవైపు రోజువారీ కేసులు తక్కువగానే ఉన్నా, దేశంలో కొవిడ్​ పరిస్థితులకు వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు ప్రజా ఆరోగ్య నిపుణులు చంద్రకాంత్​ లహరియా. సభలు, ఫంక్షన్లు.. చిన్నవైనా, పెద్దవైనా.. కొవిడ్​ వ్యాప్తికి కారణమవుతాయని ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉదాహరణలున్నట్టు గుర్తుచేశారు. అందువల్ల టీకా రెండు డోసులు తీసుకోని ప్రజలు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు(India third wave news).

సెప్టెంబర్​ నాటికి కొత్త వేరియంట్​ బయటకొస్తే.. అక్టోబర్​-నవంబర్​ మధ్యలో దేశంలో కొవిడ్​ మూడో దశ ఏర్పడే అవకాశముందని ఐఐటీ కాన్పూర్​ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్​ వెల్లడించారు. అలా జరగకపోతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు(third wave of corona). అయితే రెండో దశతో పోల్చితే మూడో దశ తీవ్రత తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశలో రోజువారీ కేసుల సంఖ్య 4లక్షలు దాటగా.. మూడో దశలో ఆ సంఖ్య 1లక్షకు మించకపోవచ్చని వివరించారు.

కేంద్రం విజ్ఞప్తి..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(Centre on Covid) పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని కేంద్రం(Centre Warns States) వెల్లడించింది. అయితే, రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలలూ పండుగల సమయం, అలాగే, ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌(VK Paul Covid) కోరారు.

ఇవీ చూడండి:-

NYT Article On India Covid: ఆ పత్రికవి రెచ్చగొట్టే కథనాలే..!

ABOUT THE AUTHOR

...view details