తెలంగాణ

telangana

కొడుకుపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తండ్రి.. అదే కారణం!

By

Published : Jul 1, 2023, 8:26 PM IST

Updated : Jul 1, 2023, 10:24 PM IST

Father Sets Son On Fire : మద్యానికి బానిసైన కుమారుడిని పెట్రోల్​ పోసి తగులబెట్టాడు ఓ తండ్రి. తీవ్రంగా గాయపడ్డ ఆ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చింది ఓ మహిళ. ఈ దారుణం బిహార్​లో జరిగింది.

Father Sets Son On Fire
Father Sets Son On Fire

Father Sets Son On Fire : మద్యానికి బానిసైన కుమారుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ తండ్రి. మంటల్లో కాలి తీవ్రంగా గాయపడ్డ బాధితుడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. దొడ్డబళ్లపుర్​ మండలంలోని వనిగరహళ్లి గ్రామంలో జయరామయ్య (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఆదర్శ్​ (28) అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన ఆదర్శ్​.. రోజూ తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. దీంతో తన కుమారుడిని మార్చాలనుకున్న తండ్రి.. డీ-అడిక్షన్​ సెంటర్​లో చేర్పించాడు. అయినా ఆదర్శ్​ మద్యం సేవించడం మానలేదు. అయితే మూడు రోజుల క్రితం ఎప్పటిలాగే తాగి ఇంటికి వచ్చిన ఆదర్శ్​.. తండ్రితో గొడవ పడ్డాడు. అనంతరం డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిపై దాడి చేశాడు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇన్నిరోజులు కొడుకు చేసిన ఆగడాలను సహించిన జయరామయ్య విసిగిపోయి.. కుమారుడని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా శుక్రవారం రాత్రి కుమారుడిని కొట్టి.. తన పొలం సమీపంలోని చెట్టుకు కట్టేశాడు. అనంతరం పెట్రోల్​ పోసి కాల్చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశాడు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని బెంగళూరు రూరల్​ ఎస్పీ మల్లికార్జున్ తెలిపారు.

వివాహేతర సంబంధం నెపంతో మహిళపై దాడి..
రాజస్థాన్​లోని ఉదయ్‌పుర్ అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో.. ఓ ఒంటరి మహిళపై కొందరు మహిళలు విచక్షణ రహితంగా దాడి చేశారు. భర్త చనిపోయి.. కుమారుడితో ఒంటరిగా నివసిస్తున్న ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టి.. జుట్టు కత్తిరించారు. అనంతరం బట్టలు విప్పి కాళ్లతో తన్నుతూ హింసించారు. బాధిత మహిళ కుమారుడు 'మా అమ్మను కొట్టదంటూ' ఏడుస్తున్న కనికరించకుండా అనాగరికులుగా ప్రవర్తించారు.

జూన్​ 29 బెకారియా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడం వల్ల.. ఉదయ్​పుర్​ ఎస్పీ భువన్ భూషన్ యాదవ్​ స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని.. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాధిత మహిళను ఆస్పత్రికి తరలించామని.. ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాన్ని పంపించినట్లు వెల్లడించారు.

భర్తతో ప్రియుడిని చంపిన మహిళ..
బిహార్​లోని ముజఫర్​పుర్​లో దారుణం జరిగింది. భర్తతో కలిసి ప్రియుడిని చంపేసింది ఓ మహిళ. ఓ వివాహిత ఒక యువకుడిని ప్రేమించింది. ఆ విషయం భర్తకు తెలిలింది. దీంతో భర్తతో కలిసి ప్రియుడిని అంతం చేసేందుకు ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి గొంతుకోసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన తర్వాత పోలీసులకు నిందితురాలు లొంగిపోయి నేరం అంగీకరించింది. పరారీలో ఉన్న మహిళ భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Last Updated : Jul 1, 2023, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details