తెలంగాణ

telangana

Delhi Court Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

By

Published : Sep 25, 2021, 4:49 AM IST

దిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో జరిగిన కాల్పుల ఘటనపై(Delhi Court Shootout) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. కోర్టు కార్యకలాపాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

cji on delhi court shootout
కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

దిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో కాల్పుల ఘటనపై(Delhi Court Shootout) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు(Delhi Court Shootout) సంబంధించి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీజేఐ మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

పోలీసులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడాలని సీజేఐ సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని అన్నారు. రోహిణి కోర్టులో కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వచ్చే వారం ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

గ్యాంగ్​స్టర్​ జితేంద్ర అలియాస్​ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు(Delhi Court Shootout) జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఇందులో ఒకరిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు దిల్లీ పోలీసు కమిషనర్​ రాకేశ్​ అస్థానా. తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు.

జితేంద్ర గోగీని వివిధ కేసుల కింద 2020లో దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం అరెస్ట్​ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు. శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్​ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే కాల్పుల ఘటన జరిగింది.

భయంభయంగా..

న్యాయమూర్తులు, న్యాయవాదులు, విచారణ కోసం వచ్చిన కక్షిదారులతో రోహిణీ కోర్టు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా జరిగిన కాల్పులు కలకలం రేపాయి. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో అంతా భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి:9 నెలల పసికందును చంపి.. గొంతు కోసుకున్న తండ్రి!

ABOUT THE AUTHOR

...view details