తెలంగాణ

telangana

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 14 మంది మృతి

By

Published : May 27, 2022, 9:23 AM IST

దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది మరణించారు. 2,296 మంది కోలుకున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క రోజే 5లక్షల 67వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

corona cases in india
కరోనా కేసులు

Corona cases in India: భారత్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 2,710 కేసులు వెలుగుచూశాయి. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు . ఒక్కరోజే 2,296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ బారినపడి కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,47,544
  • మొత్తం మరణాలు: 5,24,539
  • యాక్టివ్​ కేసులు: 15,814
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,07,177

Vaccination India: దేశవ్యాప్తంగా గురువారం 14,41,072మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 192,97,74,973కు చేరింది. ఒక్కరోజే 4,65,840 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే మాత్రం స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,67,240 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,427 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,01,57,770కు చేరింది. మరణాల సంఖ్య 63,07,663కు చేరింది. ఒక్కరోజే 5,97,520 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,06,7,229గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 87,420 కేసులు నమోదయ్యాయి. 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 46,021 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 72 మంది మృతిచెందారు.
  • జర్మనీలో 34,639 కేసులు వెలుగుచూశాయి. 89 మంది చనిపోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 33,910 కేసులు బయటపడ్డాయి. వైరస్​ ధాటికి 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 21,234 కేసులు నమోదయ్యాయి. మరో 28 మంది మృతిచెందారు.

ఉత్తరకొరియాలో లక్షకుపైగా: ఉత్తరకొరియాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,00,470 కేసులు వెలుగు చూశాయి. మరొకరు మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 32,70,850కి చేరింది. మరణాల సంఖ్య 69గా ఉంది. వైరస్ బారినపడిన వారిలో 30,37,690 మంది కోలుకున్నారు.

ఇదీ చదవండి:వీధి దీపాల కిందే చదువులు.. చిన్నారుల జీవితాల్లో ఇంజినీర్ వెలుగులు!

ABOUT THE AUTHOR

...view details