ETV Bharat / bharat

వీధి దీపాల కిందే చదువులు.. చిన్నారుల జీవితాల్లో ఇంజినీర్ వెలుగులు!

author img

By

Published : May 27, 2022, 8:12 AM IST

Teaching under streetlights: అతనో యువ ఇంజినీర్‌. చిన్నప్పుడు మురికివాడలో వీధి దీపాల కింద కష్టాలకు ఎదురీదుతూ చదువుకున్నారు. ఇప్పుడు మంచి ఉద్యోగంలో రాణిస్తున్నారు. అయినా సంతృప్తి పడలేదు. తనలాగా చదువుకునేందుకు ఎవరూ కష్టపడకూడదన్న సంకల్పించారు. రోడ్డు పక్కన వీధి దీపాల కిందే మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించారు. వందల మంది విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడుతున్నారు.

teaching children under the streetlights
teaching children under the streetlights

వీధి దీపాల కిందే చదువులు.. చిన్నారుల జీవితాల్లో ఇంజినీర్ వెలుగులు!

Teaching under streetlights: గుజరాత్‌ వడోదరాకు చెందిన ఇంజినీర్ నికుంజ్‌ త్రివేది మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవితాల్లో చీకట్లను తరిమేస్తున్నారు. వీధి లైట్ల వెలుతురులో చదువు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలో ఎవరికైనా విద్యను అందించడమే అత్యుత్తమ బహుమతి అని భావించే నికుంజ్‌ త్రివేది.. తనకున్న జ్ఞానాన్ని పిల్లలకు పంచుతున్నారు. వీధుల్లో బడికి పోకుండా ఉండే చిన్నారులకు.. ఉదయమంతా ఉద్యోగం చేసి సాయంత్రం పాఠాలు బోధిస్తున్నారు. వడోదరా కరేలిబాగ్ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై నివసించే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. 8 నెలల క్రితం ఐదుగురు పిల్లలతో ఉచిత విద్య అందించడం ప్రారంభించిన నికుంజ్‌ త్రివేది వద్ద ప్రస్తుతం 90 మంది వరకు చదువుకుంటున్నారు.

Vadodara man teaching children Under the streetlights
ఫుట్​పాత్​పై పిల్లల చదువులు

నికుంజ్ త్రివేది తన ఆదాయంలో 25 శాతం సంపాదనను ఈ విద్యార్థులకు సాయం చేసేందుకు వినియోగిస్తారు. విద్యార్థుల స్కూలు ఫీజులు కూడా నికుంజ్‌ చెల్లిస్తున్నారు. వారి పుస్తకాలకు కూడా తన సంపాదనలో కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం విద్య చాలా ఖరీదుగా మారిందని, నిరుపేద తల్లిదండ్రులు ఆ ఖర్చులను భరించే స్థితిలో లేరని త్రివేది అన్నారు. వారి కష్టాలకు పిల్లలు చదువులకు దూరం కావద్దనే.. తన వంతు సాయం చేస్తున్నానని తెలిపారు. మురికివాడల పిల్లలకు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఉచిత విద్య అందిస్తానని తెలిపారు. పిల్లలకు విద్య అందించేందుకు తొలుత ఓ ఎన్జీఓలో చేరిన త్రివేది.. కరోనా కారణంగా అది మూతపడడంతో సొంతంగా పాఠాలు బోధిస్తున్నారు.

Vadodara man teaching children Under the streetlights
వీధిలైట్ల కింద బాలలు
Vadodara man teaching children Under the streetlights
.

నికుంజ్‌ త్రివేది చేస్తున్న విద్యా యజ్ఞంలో అతని దగ్గర చదువుకున్న మరికొంత మంది పిల్లలు సాయంగా నిలుస్తున్నారు. 10, పన్నెండో తరగతి విద్యార్థులు చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా చదువు చెబుతున్నారు. అతని దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో తాము మరికొందరికి విద్య అందిస్తామని చెబుతున్నారు.

Vadodara man teaching children Under the streetlights
విద్యార్థులకు చదువు చెప్తున్న నికుంజ్

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.