తెలంగాణ

telangana

ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్​ పాదయాత్ర

By

Published : Oct 24, 2021, 11:08 AM IST

Updated : Oct 24, 2021, 11:52 AM IST

ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలకు(fuel price hike) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. నవంబరు 14 నుంచి 29 వరకు 15 రోజులపాటు ఆందోళనలు నిర్వహించనుంది. పార్టీ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు.

congress on fuel price hike
ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్​ పాదయాత్ర

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు(fuel price hike) నిరసనగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ఆందోళన చేపట్టనుంది కాంగ్రెస్​. వచ్చే నెల 14 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగనున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ పేర్కొన్నారు. ఆందోళనల్లో భాగంగా పార్టీ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ 15 రోజుల నిరసన కార్యక్రమంలో వారం రోజులపాటు కాంగ్రెస్​ కమిటీ.. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు స్పష్టం చేశారు.

'ఆర్​బీఐ చెప్పినా..'

ఇంధన​ ధరల పెరుగుదలను(fuel price hike) ఉద్దేశించి కేంద్రంపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ సీనియర్​ నేత పీ.చిదంబరం. రిజర్వు బ్యాంకు (ఆర్​బీఐ) సూచించిన విధంగా ఇంధనంపై పన్నులు తగ్గించాలన్నారు. "కేంద్రం దురాశతోనే పెట్రోల్​, డీజిల్​ ధరలను(fuel price hike) పెంచుతోంది. పంపుల్లో విక్రయించి ఇంధన ధరల పన్ను తగ్గించాలని ఆర్​బీఐ పలుమార్లు చెప్పినా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది," అని చిదంబరం ఆరోపించారు.

'మోదీ ప్రభుత్వం రికార్డులవే'

ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. దేశంలో పెట్రోల్​ ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 23.53 పెరిగాయని ట్విట్టర్​ వేదిక పేర్కొన్నారు.

"ప్రజలను ఇబ్బందుల్లో పెట్టడంలో మోదీ ప్రభుత్వం అతిపెద్ద రికార్డు సృష్టించింది. నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తులు అమ్మకాలు, భారీగా పెట్రోల్​ ధరలు పెరుగుదల వంటివి మోదీ సర్కారు సాధించిన ఘనతలు."

- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి

వరుసగా ఐదోరోజు..

వరుసగా ఐదోరోజు ఇంధన ధరల పెంపు(fuel price hike) కొనసాగింది. ఆదివారం కూడా పెట్రోల్​, డీజిల్​పై(Fuel price Today) మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.59కు చేరగా.. డీజిల్​ ధర రూ.96.32కు పెరిగింది.

ఇదీ చూడండి:'కేంద్రం అన్నింటా విఫలం.. మోదీ వాస్తవాలు తెలుసుకోవాలి'

Last Updated :Oct 24, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details