తెలంగాణ

telangana

వందేభారత్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్​

By

Published : Jul 17, 2023, 9:19 AM IST

Updated : Jul 17, 2023, 10:39 AM IST

Vande Bharat Express Catches Fire : వందేభారత్​ రైలులో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్​లోని కుర్వాయ్‌, కేథోరా రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ ఘటన జరిగింది. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Vande Bharat Express Catches Fire
Vande Bharat Express Catches Fire

Vande Bharat Express Catches Fire : మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నుంచి దిల్లీకి వెళ్తున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం సి-12 కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగడాన్ని కొందరు రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే రైలును విదిషా జిల్లాలోని కుర్వాయ్​, కైథోరా స్టేషన్ల మధ్య నిలిపివేశారు. అనంతరం ఆ కోచ్​లో ఉన్న సుమారు 22 మంది ప్రయాణికులను సురక్షితంగా ఇతర కోచ్​లలోకి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

వందేభారత్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు కలకలం.. ప్రయాణికులంతా..

"రాణి కమలాపతి స్టేషన్ నుంచి నిజాముద్దీన్ టైర్మినల్​ వరకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్-20171 బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగి పొగ వ్యాపించింది. రైలును కుర్వాయి,కేథొరా స్టేషన్‌ల మధ్య నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. బ్యాటరీ బాక్స్​ సమస్యను సరిదిద్దాం."
--రాహుల్ శ్రీవాస్తవ, పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్​ఓ

Vande Bharat Express Accident : మంటలు బ్యాటరీ బాక్స్​కు మాత్రమే పరిమితం కావడం వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని రైల్వే శాఖ తెలిపింది. బ్యాటరీ బాక్స్​ ప్యాసింజర్​లు ఉండే ప్రదేశానికి దూరంగా అండర్​గేర్​లో ఉంటుందని.. ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ భద్రతా వ్యవస్థలు బ్యాటరీలను వేరుచేశాయని వెల్లడించింది. సమస్య తలెత్తిన బ్యాటరీలను తీసేశామని స్పష్టం చేసింది.

"ఉదయం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు నా సీటు కింద నుంచి మంటలు వస్తున్న శబ్దం వినిపించింది. ఈ విషయం నేను మిగతా ప్రయాణికులకు చెప్పాను. దీంతో అందరూ భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. రైలు ఆగిన తర్వాత కోచ్ బ్యాటరీ బాక్స్​లో మంటలు వ్యాపించడం చూశాం. ఆ తర్వాత మమ్మల్ని కిందకు దించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు" అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. మంటలు చెలరేగిన రైలు.. మధ్యప్రదేశ్​లోని తొలి వందేభారత్​ ఎక్స్​ప్రెస్​. భోపాల్- దిల్లీ మధ్య దీన్ని ఏప్రిల్​ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

రైలు బ్యాటరీ బాక్స్​లో చెలరేగుతున్న మంటలు

3 గంటల పాటు నిలిచిన వందేభారత్​..!
Vande Bharat Express Accident in Odisha : మే నెలలో భారీ వర్షాలకు చెట్టు కొమ్మలు విరిగి.. వందేభారత్​ ఎక్స్​ప్రెస్​పై పడ్డాయి. దీంతో మూడు గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. పూరీ నుంచి హౌరా వెళుతున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్​కు ఈ ప్రమాదం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నాలుగు రోజులకే ఇలా గమనార్హం. ఒడిశాలోని జైపుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated :Jul 17, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details