తెలంగాణ

telangana

దేవుడికి భక్తుల వింత పూజలు.. కానుకలుగా గడియారాలు, సిగరేట్​ వెలిగించి మొక్కులు

By

Published : Jan 22, 2023, 10:04 AM IST

Updated : Jan 22, 2023, 7:28 PM IST

Clock tree in Madhya Pradesh

మధ్యప్రదేశ్​లోని ఓ గుడిలో దేవుడికి భక్తులు విచిత్రంగా పూజలు చేస్తున్నారు. కానుకలుగా గడియారాలు చెల్లిస్తున్నారు. సిగరెట్​ వెలిగించి మరీ కోరికలు కోరుతున్నారు. ఉజ్జయిని జిల్లాలో ఈ ఆలయం ఉంది.

దేవుడికి భక్తుల వింత పూజలు

సాధారణంగా దేవుడికి పూలు, పండ్లు, ఇతర నైవేద్యాలు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ మాత్రం వింతగా గడియారాలు కానుకలుగా ఇస్తున్నారు. దేవుడి ముందు సిగరెట్​ వెలిగించి కోరికలు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్​లోని సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయంలో ఇలా విచిత్రంగా పూజలు చేస్తున్నారు భక్తులు. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్ రోడ్డు పక్కన ఉందీ ఆలయం.

ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. కోరుకున్న కోరికలు తీరిన అనంతరం.. భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను ఘడి వాలే బాబా సమర్పిస్తారు. దీంతో ఆ రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ చెట్టుకు దాదాపు 2వేల గడియారాలు వేలాడదీసి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి.

"నేను రెండు గడియారాలు తీసుకుని వచ్చాను. దేవున్ని కోరిక కోరుకుని తరువాత వాటిని మర్రి చెట్టుకు కట్టాను. మొదట దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. అగరబత్తులు వెలిగించి, సిగరెట్​ వెలిగించి మొక్కులు చెల్లించాను. టైం బాగాలేని వారు ఇక్కడికి వచ్చి గడియాలు దేవుడికి సమర్పిస్తే వారు బాధలు తొలగిపోతాయని నమ్మకం."
-ఫెహ్లాద్​ సింగ్​​, భక్తుడు

ఈ గుడిలో పూజారులెవ్వరు ఉండరు. భక్తులే సొంతంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ముందుగా కొబ్బరి కాయలు కొట్టి, అగరబత్తులు వెలిగిస్తారు. అనంతరం ఓ సిగరెట్​ వెలిగించి ఘడి వాలే బాబా ముందు కోరికలు కోరుకుంటారు. గత పదేళ్లుగా ఈ గుళ్లో ఈ తరహా పూజలు జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ గుడికి భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు వారు తెలిపారు. ఈ గుడికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా.. వంద కిలో మీటర్ల అవతల నుంచి కూడా భక్తులు వస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. పౌర్ణమి, ఆదివారం రోజుల్లో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని వారు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

పెంపుడు శునకాన్ని 'కుక్క' అని పిలిచినందుకు దారుణం.. కత్తితో పొడిచి రైతు హత్య

మార్చురీలో డెడ్​బాడీల కళ్లు మాయం.. ఎలుకలే కారణమట!

Last Updated :Jan 22, 2023, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details