తెలంగాణ

telangana

వెంకయ్య అరుణాచల్​ టూర్​పై చైనా అభ్యంతరం- తిప్పికొట్టిన భారత్

By

Published : Oct 13, 2021, 5:54 PM IST

Updated : Oct 13, 2021, 6:31 PM IST

f
వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం ()

అరుణాచల్ ప్రదేశ్​​పై (Arunachal pradesh) ఆది నుంచి వివాదాలు సృష్టిస్తున్న చైనా (China news today) మరోసారి తన నైజాన్ని చాటుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చింది కేంద్రం.

పొరుగు దేశం చైనా(China news today).. భారత్​తో మరో వివాదానికి తెరతీసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. అరుణాచల్​ ప్రదేశ్(Arunachal pradesh)​ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు ప్రకటన చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్. అరుణాచల్​ను భారత ప్రభుత్వం ఏకపక్షంగా, అక్రమంగా ఏర్పాటు చేసిందని, ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదన్నారు.

ఖండించిన భారత్​..

చైనాకు దీటుగా బదులిచ్చింది భారత్ (India china news)​. అరుణాచల్​ ప్రదేశ్​.. భారత్​లో అంతర్భాగమని, విడదీయరానిదని తేల్చిచెప్పింది. యథాతథ స్థితి మార్చేందుకు.. చైనా ఏకపక్ష ప్రయత్నం చేస్తోందని అన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చీ.

అరుణాచల్​ ప్రదేశ్​ను.. దక్షిణ టిబెట్​లో భాగమని కొంతకాలంగా వాదిస్తోంది చైనా (China news today). ఈ నేపథ్యంలోనే అక్టోబర్​ 9న అక్కడ ఉపరాష్ట్రపతి పర్యటించడాన్ని తప్పుబట్టింది.

తూర్పు లద్దాఖ్​ ప్రతిష్టంభనపై అక్టోబర్​ 10న భారత్​-చైనా 13వ విడత సైనిక చర్చలు జరిగాయి. ఫ్రిక్షన్​ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ వేగవంతం చేయాలని పట్టుబట్టింది భారత్​. అయితే.. సైనిక చర్చల్లో (India China talks) సరిహద్దు సమస్యకు (India China standoff) పరిష్కారం దిశగా ఎలాంటి పురోగతి లభించలేదని మరుసటి రోజే భారత సైన్యం ప్రకటించింది. పరిష్కారం కోసం భారత్ చేసిన నిర్మాణాత్మక సూచనలను.. చైనా(India China latest news) అంగీకరించలేదని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే వెంకయ్య పర్యటన రూపంలో.. మరోసారి భారత్​తో కయ్యానికి కాలుదువ్వింది చైనా.

ఇదీ చూడండి: 'చైనా పెడ ధోరణి- 13వ విడత చర్చల్లో పురోగతి శూన్యం'

Last Updated :Oct 13, 2021, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details