తెలంగాణ

telangana

ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు- తీవ్ర రక్తస్రావంతో మృతి

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 7:43 PM IST

Updated : Dec 17, 2023, 7:55 PM IST

Child Died After a Car Ran Over : కర్ణాటక రాజధానిలో హృదయ విదారక ఘటన జరిగింది. అపార్ట్​మెంట్​ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందింది.

Child Died After a Car Ran Over
Child Died After a Car Ran Over

Child Died After a Car Ran Over :అపార్ట్​మెంట్​ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్​ 9న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
కసువినహళ్లి పరిధిలోని సమృద్ధి అపార్ట్​మెంట్​ ఎదురుగా ఈ ఘటన జరిగింది. నేపాల్​కు చెందిన జోగ్​ జుథర్, అనిత దంపతుల చిన్నారి అర్బినా అపార్ట్​మెంట్ గేటు ఎదురుగా ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే అదే అపార్ట్​మెంట్​కు చెందిన వ్యక్తి చిన్నారిని గమనించకుండా కారును వెళ్లనిచ్చాడు. ఆ తర్వాత చిన్నారిని ఏడవడాన్ని గమనించిన తల్లిదండ్రులు గేటులో ఇరుక్కుపోయి ఏడుస్తోందని భావించారు. ఆ తర్వాత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చిన్నారి భుజం విరిగిపోయిందని చెప్పారు. దీంతో మెరుగైన చికిత్స కోసం సంజయ్​ గాంధీ ఆస్పత్రికి తీసకెళ్లారు తల్లిదండ్రులు. ఆ తర్వాత అక్కడి నుంచి నింహన్స్​ ఆస్పత్రికి తరలించాలని సూచించారు వైద్యులు. ఈ క్రమంలోనే అక్కడికి తీసకుని వెళ్తుండగా దారిలోనే మరణించింది.

అనంతరం పోస్టుమార్టం పరీక్ష నిర్వహించగా, అంతర్గతం రక్తస్రావం జరిగి మరణించిందని తేలింది. ఈ ఘటనపై డిసెంబర్​ 10న బెల్లందూర్​ పోలీస్ స్టేషన్​ ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. చిన్నారి పైనుంచి కారు వెళ్లడం వల్లే ఘటన జరిగినట్లు తేలింది.

11 ఏళ్ల బాలుడిని లైంగింకంగా వేధించిన టీచర్​
11 ఏళ్ల బాలుడిని లైంగింకంగా వేధించాడు ఓ ట్యూషన్​ టీచర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ శహరన్​పుర్​ జిల్లాలో జరిగింది. శనివారం ట్యూషన్​కు వెళ్లిన బాలుడిని టీచర్​ దేవ్​ కుమార్​ లైంగింకంగా వేధించారు. ఈ విషయం బాలుడి తండ్రికి తెలియడం వల్ల అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

15నెలల బాలుడికి అరుదైన వ్యాధి- 17 కోట్ల ఇంజెక్షన్​తో నిలిచిన ప్రాణాలు- ఎలా సాధ్యమైందంటే?

బాలికకు 'హాట్​' అంటూ హాయ్​!- 50 ఏళ్ల వ్యక్తికి పోక్సో కోర్టు షాక్​

Last Updated : Dec 17, 2023, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details