ETV Bharat / bharat

బాలికకు 'హాట్​' అంటూ హాయ్​!- 50 ఏళ్ల వ్యక్తికి పోక్సో కోర్టు షాక్​

author img

By PTI

Published : Dec 17, 2023, 7:36 AM IST

Updated : Dec 17, 2023, 9:10 AM IST

Man Gets 3 Years Jail For Calling Minor Hot : బాలికపై 'హాట్​' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన 50 ఏళ్ల వ్యక్తికి పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.

Man Gets 3 Years Jail For Calling Minor Hot
Man Gets 3 Years Jail For Calling Minor Hot

Man Gets 3 Years Jail For Calling Minor Hot : బాలికను 'హాట్​' అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి మహారాష్ట్ర ముంబయిలోని ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. భారతీయ శిక్షస్మృతిలోని పలు సెక్షన్ల కింద అతడిని దోషిగా నిర్ధరిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఎస్​సీ జాదవ్​ డిసెంబర్ 14న తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించిన వివరణాత్మక ఆర్డర్​ శనివారం అందుబాటులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే?
2016 మే 24న 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఓ మసీదు వద్ద నిల్చుని ఉంది. ఇంతలో నిందితుడు ఆమె వద్దకు వెళ్లి అనుచితంగా తాకాడు. అంతటితో ఆగకుండా ఆమె చాలా 'హాట్​'గా ఉందని, బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలని ఉందని అన్నాడు. ఆమెను తనతో తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు అసభ్యంగా మాట్లాడాడు.

బాధితురాలి కుటుంబసభ్యుల ద్వారా ఫిర్యాదు అందుతున్న పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడాలనే ఉద్దేశంతో ఆమెను తాకడం, అసభ్యంగా మాట్లాడటం చేశాడని తెలిపింది. దీంతోపాటు నిందితుడు బాలికను వెంబడించి లైంగికంగా వేధించేవాడని రుజువైందని కోర్టు పేర్కొంది.

నిందితుడికి ఐదేళ్ల శిక్ష రద్దు చేసిన కోర్టు!
ఓ నిందితుడికి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను అలహాబాద్​ హైకోర్టు లఖ్​నవూ బెంచ్​ రద్దు చేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో బాధితుల వాంగ్మూలంలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జరిగింది.

ఇదీ జరిగింది!
తన కుమార్తెను అపహరించి ఆమెతో ఓ వ్యక్తి బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తూ 1997లో లఖ్​నవూలోని గోసాయ్​గంజ్ ​పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుపై సెషన్స్​ కోర్టులో విచారణ జరిగింది. అనంతరం నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించింది. దీన్ని నిందితుడు హైకోర్టులో సవాల్​ చేశాడు.

ఈ కేసులో సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు పరిశీలించిన లఖ్​నవూ బెంచ్,​ అప్పీలుదారుని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలంలో వైరుధ్యాలు ఉన్నాయని తెలిపింది. సాక్ష్యాధారాల ప్రకారం బాధితురాలు నిందితుడితో తన ఇష్టంతోనే వెళ్లినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక తన అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెప్పింది. ​అప్పీలుదారుని వెంటనే విడుదల చేయాలని సంబంధిత జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.

అతడికి మరణదండన, 92ఏళ్లు జైలుశిక్ష.. బాలుడ్ని చంపి, బాలికను రేప్​ చేసిన కేసులో తీర్పు

మైనర్​పై రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష- రూ.10లక్షల జరిమానా

Last Updated :Dec 17, 2023, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.