ETV Bharat / bharat

మైనర్​పై రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష- రూ.10లక్షల జరిమానా

author img

By PTI

Published : Dec 15, 2023, 6:43 PM IST

Updated : Dec 15, 2023, 7:02 PM IST

BJP MLA Convicted In Rape Case
BJP MLA Convicted In Rape Case

BJP MLA Convicted In Rape Case : మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. నిందితుడికి రూ.10 లక్షల జరిమానా వేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

BJP MLA Convicted In Rape Case : మైనర్​పై అత్యాచారం కేసులో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక నిందితుడికి రూ.10 లక్షల జరిమానా వేసింది. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.

ఇదీ జరిగింది?
దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్​దులార్ గోండ్​ 2014 నవంబరు 4న ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు మైయర్​పుర్​ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. అప్పుడు గోండ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. పోక్సో ఆ తర్వాత జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఈ కేసును పోక్సో కోర్టు సోన్​భద్రలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిగిన కోర్టు నిందితుడు రామ్​దులార్​కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేగాక గోండ్​కు రూ.25 లక్షల జరిమానా వేసింది.

డిసెంబర్ 12న దుద్ది ఎమ్మెల్యే రామ్​దులార్ గోండ్​ను కోర్టు దోషిగా తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది త్రిపాఠి తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు విధించిన శిక్షను తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారని చెప్పారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే పూర్తిగా ఆదుకుంటానని కోర్టుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మైనర్​పై అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి భార్య సర్పంచ్​గా ఉండేవారని తెలిపారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినప్పుడు చట్టసభ సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోతారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటువారిపై అనర్హత వేటు ఉంటుంది. ఈ క్రమంలో దుద్ది ఎమ్మెల్యేకు ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష విధించడం వల్ల ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.

'ముఖ్తార్ అన్సారీకి ఐదున్నరేళ్ల జైలు శిక్ష'
బొగ్గు వ్యాపారి నందకిశోర్ రుంగ్టా సోదరుడు మహావీర్​ప్రసాద్​ను బెదిరించిన కేసులో గ్యాంగ్​స్టర్​, మాజీ శాసనసభ్యుడు ముఖ్తార్​ అన్సారీకి ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించింది వారణాసి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు. అంతేకాకుండా అన్సారీకి రూ.10వేలు జరిమానా వేసింది. గత ఏడాదిన్నర కాలంలో ముఖ్తార్ అన్సారీకి 7 కేసుల్లో శిక్షలు పడ్డాయని లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అవధేష్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్​కు గతంలో జీవిత ఖైదు పడిందని చెప్పారు.

  • Uttar Pradesh: MP/MLA Court Varanasi sentences gangster turned politician Mukhtar Ansari to five and a half years rigorous imprisonment in a 26-year-old case of threatening the witness of the murder of a coal businessman Nand Kishore Rungta. In the last one and a half years,… pic.twitter.com/OZdkjAtwuX

    — ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కోర్టులోనే మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు!- రంగంలోకి సీజేఐ- నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

షూ సోల్ కట్ చేసి గ్యాస్ బాంబులు ఫిక్స్- పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు

Last Updated :Dec 15, 2023, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.