తెలంగాణ

telangana

ఛత్తీస్​గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్​ ప్రమాణం- మోదీ, యోగి హాజరు

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 4:14 PM IST

Updated : Dec 13, 2023, 4:54 PM IST

Chhattisgarh CM Swearing In Ceremony : ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు విష్ణుదేవ్ సాయ్​. ఆయనతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ హాజరయ్యారు.

Chhattisgarh Cm Swearing In Ceremony
Chhattisgarh Cm Swearing In Ceremony

Chhattisgarh CM Swearing In Ceremony :ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్​పుర్​లోని సైన్స్​ కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్, రమణ్​సింగ్ హాజరయ్యారు.

అనూహ్యంగా రేసులోకి వచ్చిన విష్ణుదేవ్ సాయ్
అంతకుముందు ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్​ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా పనిచేసిన రమణ్‌ సింగ్‌ను కాదని ఈసారి బీజేపీ అధిష్ఠానం గిరిజన నాయకుడైన విష్ణుదేవ్‌ సాయ్‌వైపు మొగ్గు చూపింది.

ఎవరీ విష్ణుదేవ్​ సాయ్​?
1964 ఫిబ్రవర్ 21వ తేదీన ఛత్తీస్​గఢ్​లో గిరిజన కుటుంబంలో జన్మించిన విష్ణుదేవ్​ సాయ్​కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాలుగు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జష్​పుర్​ జిల్లాలోని కుంకురీ నుంచి తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం సర్గుజా డివిజన్‌లోని మొత్తం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, అందులో సాయ్ పాత్ర చాలా కీలకం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నడూ గెలవని అనేక స్థానాల్లో కూడా సాయ్​ వ్యూహంతో బీజేపీ గెలిచింది.

ఛత్తీస్​గఢ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు
డిసెంబర్​ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో 2003లో 50, 2008లో 50, 2013లో 49 సీట్లు గెలుచుకొని సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయదళం మునుపెన్నడూ లేనంతగా మెజార్టీని సొంతం చేసుకుంది. ఇక, గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్‌ సీట్లు పడిపోయాయి.

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

మధ్యప్రదేశ్​ సీఎంగా మోహన్​ యాదవ్​ ప్రమాణం- మోదీ, షా హాజరు

Last Updated :Dec 13, 2023, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details