తెలంగాణ

telangana

ట్రైబ్యునళ్ల ప్రాధాన్యం తగ్గిస్తారా?: కేంద్రంపై సుప్రీం అసహనం

By

Published : Sep 6, 2021, 2:05 PM IST

ట్రైబ్యునళ్లలో(Tribunals) ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ.. వాటి ప్రాధాన్యతను కేంద్రం తగ్గిస్తోందని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు(Supreme court). న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై గౌరవం లేనట్టుగా కేంద్రం చర్యలు కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది.

sc
సుప్రీంకోర్టు

ట్రైబ్యునళ్లలో(Tribunals) ఖాళీలను భర్తీ చేయకుండా వాటి ప్రాధాన్యాన్ని కేంద్రం తగ్గిస్తోందని సుప్రీంకోర్టు(Supreme court) సోమవారం అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఈ నెల 13లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

"ఖాళీలను భర్తీ చేయకుండా ట్రైబ్యునళ్ల ప్రాధాన్యాన్ని మీరు తగ్గిస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై గౌరవం లేనట్టుగా ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ట్రైబ్యునల్​ సంస్కరణల చట్టాన్ని ఉంచడమా లేదా ట్రైబ్యునళ్లను పూర్తిగా తీసివేయడమా? లేదా మేమే ఖాళీలను భర్తీ చేయడమా అనే ఐచ్ఛికాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఛైర్మన్లు, సభ్యులు లేకుండా ట్రైబ్యునళ్ల ప్రాధాన్యం తగ్గుతోంది. వీటిపై మీ ప్రత్యమ్నాయ ప్రణాళికలు ఏంటో చెప్పండి.

-సుప్రీంకోర్టు

ప్రభుత్వంతో తాము ఎలాంటి వివాదం పెట్టుకోవాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం పట్ల తాము సంతోషంగా ఉన్నామని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్​ 13కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:ఈడీ విచారణకు అభిషేక్ బెనర్జీ

ABOUT THE AUTHOR

...view details