తెలంగాణ

telangana

Case Filed on Jabardasth Comedian Nava Sandeep : యువతిని శారీరకంగా వాడుకుని మోసం..! జబర్దస్త్​ కమెడియన్​పై కేసు నమోదు

By

Published : Aug 20, 2023, 1:05 PM IST

Cheating Case on Jabardasth Comedian Nava Sandeep : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై తమదైన శైలిలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, సింగర్​ నవ సందీప్​పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్​ పీఎస్​లో కేసు నమోదు చేశారు.

Jabardasth Comedian Nava Sandeep
Case Filed on Jabardasth Comedian

Case Filed on Jabardasth Comedian Nava Sandeep :నువ్వే ప్రాణం.. నువ్వే జీవితం.. నిన్నే ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నీతోనే జీవితమన్నాడు.. నీవు లేనిదే బతకలేనన్నాడు.. ప్రియుడి మాటలు నమ్మి.. మనసిచ్చిన ప్రియుడే తనను మనువాడతాడనుకుని ఆ యువతి సర్వస్వం అర్పించింది. తీరా పెళ్లికి ప్రియుడు నిరాకరిస్తుండటంతో నిలువునా మోసపోయానని గుర్తించింది. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబర్దస్త్​ కమెడియన్ (Jabardasth Comedian), గాయకుడు నవ సందీప్(Singer Nava Sandeep) ప్రేమ పేరుతో ఓ యువతి(28) జీవితంతో ఆడుకున్నాడు. 2018లో యువతితో వాట్సాప్ ఛాటింగ్​తో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దాంతో ప్రియురాలిని తన స్వగ్రామం నుంచి హైదరాబాద్​కు రప్పించుకున్నాడు. షేక్​పేటలోని ఓ హాస్టల్​లో ఉంచాడు. ఆమె 4 సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది.

Minor Girl Gang Rape: ప్రేమ పేరుతో లోబరచుకుని.. దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. అవమాన భారంతో..!

Case Registerd on Jabardasth Artist at Madhuranagar PS :ఈ క్రమంలో నవ సందీప్ యువతిని పలుమార్లు ఓయో, హోటళ్లకు తీసుకెళ్లి తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ప్రతిసారి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. యువతితో శారీరకంగా(Fulfilled All His Desires Physically) తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే.. పెళ్లి లేదు.. ఏం లేదంటూ మాట మార్చాడు. పెళ్లిచేసుకోలేను.. నువ్వంటే నాకిష్టం లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో ప్రేమికురాలు పోలీస్​స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసుల దగ్గర తన గోడును వెల్లబోసుకుంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్తున్నాడని వాపోయింది. ఇప్పుడు తన జీవితం అంధకారమైందని.. అటు ఇంట్లోంచి బయటికొచ్చి.. ఇటు ప్రియుడి చేతిలో మోసపోయానని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పెరుగుతున్న అఘాయిత్యాలు..: ఏదేమైనా.. రాష్ట్రంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి దాకా.. కామాంధులు ఎవరినీ వదలడం లేదు. వావి వరసలు మరచి.. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. బ్లాక్‌ మెయిల్‌తో ఒకడు, బెదిరించి మరొకడు, స్నేహం పేరుతో ఇంకొకడు, ప్రేమ, పెళ్లి.. ఇలా 'అఘాయిత్యానికి పాల్పడేందుకు అడ్డదారులెన్నో' అన్నట్లుగా బంధువులు, తెలిసిన వారు, పరిచయస్థులు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడేలా చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు.

అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!

ఔను వారిద్దరూ ఆసుపత్రిలో ఒక్కటయ్యారు

కాలేజీలోనే ప్రేమ పెళ్లి.. యూత్​ ఫెస్టివల్​లో అంతా షాక్​

ABOUT THE AUTHOR

...view details