తెలంగాణ

telangana

C 295 Transport Aircraft India : భారత వాయుసేనలోకి పవర్​ఫుల్ విమానం.. తొలి సీ-295ని అందజేసిన ఎయిర్​బస్

By PTI

Published : Sep 13, 2023, 5:18 PM IST

Updated : Sep 13, 2023, 6:37 PM IST

C 295 Transport Aircraft India : భారత వైమానిక దళ సామర్థ్యం పెంచే తొలి సీ-295 ట్రాన్స్​పోర్ట్​ విమానాన్ని ఫ్రాన్స్​కు చెందిన ఎయిర్​బస్​ సంస్థ భారత్​కు అందజేసింది. భారత్​ తరఫున ఫ్రాన్స్​లోని ఎయిర్​బస్​ ప్రొడక్షన్​ ప్లాంట్​లో వైమానిక దళపతి ఎయిర్ చీఫ్​ మార్షల్ వీర్​ఆర్​ చౌదరి​ అందుకున్నారు.

C 295 Transport Aircraft India
C 295 Transport Aircraft India

C 295 Transport Aircraft India :భారత వాయుసేనలో అత్యాధునిక రవాణా విమానం చేరింది. ఫ్రాన్స్​కు చెందిన ఎయిర్​బస్​ డిఫెన్స్​ అండ్​ స్పేస్​ సంస్థ తొలి C-295 ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్​క్రాఫ్ట్​ను బుధవారం భారత్​కు అందజేసింది. దక్షిణ స్పానిష్​ నగరం సెవిల్లేలోని ఎయిర్​బస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి వైమానిక దళపతి ఎయిర్ చీఫ్​ మార్షల్ వీర్​ఆర్​ చౌదరి ఈ విమానాన్ని అందుకున్నారు. అనంతరం అదే విమానంలో భారత్​కు పయనమయ్యారు. ఈ విమానం ఈజిప్టులోని మట్లా, బెహ్రెయిన్​లో ఆగి.. వడోదర ఎయిర్​బేస్​కు చేరుకోనుంది. మొత్తం విమానాలు డెలివరీ అయితే.. ప్రపంచంలోనే భారత వైమానిక దళం అతిపెద్ద C-295 అపరేటర్​ అవుతుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్​ చివరి వారంలో ఈ విమానం అధికారికంగా వాయుసేనలోకి చేరే అవకాశం ఉంది.

మొదటి సీ-295 విమానం డెలివరీ అందుకున్న తర్వాత ఐఏఎఫ్​ చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్ వీఆర్​ చౌదరి మాట్లాడారు. ఇది యావత్​ దేశానికి ఒక మైలురాయి అని.. ఆత్మనిర్భర్​ భారత్​కు నిదర్శన అని అన్నారు. 'వాయుసేన వ్యూహాత్మక ఎయిర్​లిఫ్ట్​ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. దేశంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ డీల్​లో భాగంగా 17వ విమానాన్ని భారత్​లో తయారవుతుంది. ఇది దేశంలో తయారైన మొదటి మిలిటరీ రవాణా విమానం అవుతుంది. ఇది భారతీయ ఎవియేషన్​ పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగు' అని వివరించారు.

వైమానికి దళాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్​ ఫోర్స్, ఎయిర్​బస్​ మధ్య రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఎయిర్​బస్​ 2025 చివరి నాటికి 'ఫ్లై-అవే' స్థితిలో మొదటి 16 విమానాలను అప్పగించాల్సి ఉంటుంది. మరో 40 విమానాలను భారత్​లో.. టాటా అడ్వాన్స్​డ్​ సిస్టమ్స్​ తయారు చేసి.. అసెంబుల్ చేస్తుంది. వాయుసేనకు చెందిన అవ్రో విమానాల స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.

Airbus C295 Specifications :అత్యవసర పరిస్థితుల్లో సైనికులను తరలించడానికి ఈ C-295 విమానం ఉపయోగపడుతుంది. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం 71 ట్రూప్స్​ను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు. పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సీ-295 వెళుతుంది. మిలిటరీ లాజిస్టిక్స్​ కోసం ఉపయోగించే ఉన్నతమైన విమానంగా ఈ సీ-295 పసిద్ధి చెందింది. ఈ విమానాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్​ వార్ ఫేర్ సూట్​లను ఇన్​స్టాల్​ చేస్తారు. ఇక వీటి తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్​ఎస్​ఎమ్​ఈలు పాలుపంచుకోనున్నాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

తేజస్ 'ల్యాండింగ్​' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!

26 రఫేల్​ జెట్స్ కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Last Updated : Sep 13, 2023, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details