తెలంగాణ

telangana

Bus Shelter Theft Case : బస్​స్టాప్ చోరీ కేసులో ట్విస్ట్​.. ఫిర్యాదు చేసిన సంస్థపైనే తిరిగి కేసు.. ఏమైందంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:18 AM IST

Updated : Oct 11, 2023, 10:37 AM IST

Bus Shelter Theft Case Twist : కర్ణాటక బెంగళూరులో ఇటీవల చోరీకి గురైన బస్​స్టాప్ కేసును ఛేధించారు నగర పోలీసులు. ఆ బస్​స్టాప్ చోరి కాలేదని.. నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల అధికారులే అక్కడి నుంచి తరలించారని దర్యాప్తులో తేలింది.

Bus Shelter Theft Case
Bus Shelter Theft Case

Bus Shelter Theft Case Twist :కర్ణాటక బెంగళూరు నగరంలో ఇటీవల బస్​స్టాప్ చోరీకి గురైన కేసు మలుపు తిరిగింది. ఆ బస్​స్టాప్ చోరీ కాలేదని.. నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల అధికారులే అక్కడి నుంచి తరలించారని దర్యాప్తులో తేలింది. మరోవైపు నాణ్యత లేకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు అధికారులు.

ఇదీ జరిగింది..
నగరంలోని కన్నింగ్​హామ్ రోడ్​లో బస్​స్టాప్ నిర్మాణానికి సైన్​బోర్డ్ అనే కంపెనీకి అనుమతి ఇచ్చింది బృహత్ ​బెంగళూరు మహానగర పాలకె(బీబీఎంపీ) . ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21న రూ.10లక్షల విలువైన బస్​స్టాప్​ను ఏర్పాటు చేసింది సంబంధిత సంస్థ. అనంతరం ఆగస్టు 27 ఈ బస్​స్టాప్​ను పరిశీలించేందుకు కంపెనీ ప్రతినిధులు రాగా.. అది కనిపించలేదు. వెంటనే బీబీఎంపీ అధికారులను సంప్రదించారు సంస్థ ప్రతినిధులు. అయితే, బస్​స్టాప్​ను తాము తరలించలేదని అధికారులు చెప్పడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది నిర్మాణ సంస్థ.

సెప్టెంబర్‌ 30న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాణ్యత లేకుండా నిర్మించారంటూ ఫిర్యాదు రావడం వల్ల స్థానిక శివాజీనగర్​ ఈఈ బస్​స్టాప్​ను పరిశీలించారు. నాణ్యత లేకుండా ఉండడం వల్ల బస్​స్టాప్​ను అక్కడి నుంచి గోడౌన్​కు తరలించినట్లు తేలింది. ఈ విషయం తెలియని నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నాణ్యత లేకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు అధికారులు.

రోడ్డును చోరీ చేసిన దొంగలు.. PWD మంత్రి సొంత జిల్లాలోనే ఘటన
సాధారణంగా దొంగలు చిన్న చిన్న వస్తువులు చోరీ చేస్తారు. గజ దొంగలైతే కార్లు, బైకులు, ఏటీఎం మెషీన్లు దొంగిలిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఐరన్​ బ్రిడ్జి దగ్గరి నుంచి రైలు ఇంజిన్​ వరకు.. రోడ్డు రోలర్​ నుంచి సెల్​ టవర్​ వరకు దేన్నైనా సూనాయాసంగా చోరీ చేస్తున్నారు. తాజాగా అంతకుమించిన మరో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డు ఎత్తుకెళ్లారు కొందరు దొంగలు. వినడానికి వింతగా ఉన్నా ఇదే జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఏకంగా సెల్​ టవర్​నే చోరీ చేసిన దొంగలు.. భాగాలుగా విడగొట్టి..

ఆర్టీసీ బస్​ను​ ఎత్తుకెళ్లిన దొంగలు.. వరుడి మెడలోని డబ్బుల దండ చోరీ

Last Updated : Oct 11, 2023, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details