తెలంగాణ

telangana

ఈడీ డైరెక్టర్‌కు కవిత లేఖ.. మహిళగా తన స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ..

By

Published : Mar 21, 2023, 12:51 PM IST

MLC Kavitha Writes a Letter to ED : బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వరుసగా రెండోరోజూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరవుతున్న సమయంలో ఫోన్లను చూపిస్తున్న కార్యాలయంలోకి లోపలకు వెళ్లారు. మరోవైపు విచారణకు వాస్తవవిరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని ఈడీ డైరెక్టర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు.

MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha Writes a Letter to ED : మద్యం కుంభకోణంపై విచారణలో భాగంగా బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. వరుసగా రెండోరోజూ మొత్తంగా మూడోసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చే క్రమంలో కవర్లలో తీసుకెళ్తున్న ఫోన్లను కవిత చూపించారు. దర్యాప్తులో భాగంగా కవిత 10 మొబైల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ ఛార్జ్‌ షీట్‌లో పొందుపరిచింది. ఇందులో భాగంగానే విచారణకు తాను మార్చిన మొబైల్ ఫోన్‌లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తాను ఎక్కడ తప్పు చేయలేదు నిర్దోషిగానే ఉన్నాను ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కవిత ఇప్పటికే ప్రకటించింది.

ఈడీకి లేఖ రాసిన కవిత :మరోవైపు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. దర్యాప్తునకు సంబంధించి వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలు చేయడాన్ని లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ ఆరోపించిన పది ఫోన్లను ఐఎంఈఏ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లుగా తెలిపారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా తన మొబైల్ ఫోన్లను కోరారని... అయినప్పటికీ... తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్ద :దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించదా ? అని లేఖలో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ... తాను ఫోన్‌ను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని లేఖలో ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ దర్యాప్తు :తనను తొలిసారిగా ఈడీ మార్చిలో విచారణకు పిలిచిందని... కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఆరోపించడం దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని కవిత పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని తెలిపారు. తద్వారా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరమని కవిత లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details