తెలంగాణ

telangana

వివాహేతర సంబంధం వద్దు అన్నందుకు.. మహిళ కొడుకును చంపి..

By

Published : Dec 21, 2021, 10:47 AM IST

Boy killed in MP: ఆరేళ్ల బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలుడి తల్లి నిందితుడితో వివాహేతర సంబంధానికి నిరాకరించడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

BOY KILLED
BOY KILLED

Boy killed in MP: అక్రమ సంబంధానికి నిరాకరించిందన్న కోపంతో ఆ మహిళ కుమారుడిని ఓ యువకుడు హత్య చేశాడు. ఆరేళ్ల బాలుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తీవ్రంగా చితకబాది ప్రాణాలు తీశాడు. మధ్యప్రదేశ్​లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

MP crime news

శనివారం తమ ఆరేళ్ల కుమారుడు కనిపించకుండా పోయాడని మహిళ, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ కూలీ పని చేసుకుంటూ ఉంటారని ఎస్పీ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. పని ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి తమ కొడుకు జాడ లేదని చెప్పినట్లు వివరించారు.

"దినేశ్ భిలాలా అలియాస్ నానా(21)తో కలిసి చిన్నారి పొలాల వైపు వెళ్లడాన్ని పొరుగింటివారు చూశారు. ఈ విషయాన్ని దంపతులకు చెప్పారు. ఈ సమాచారంతో 24 గంటల వ్యవధిలోనే భిలాలాను పట్టుకున్నాం. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తనతో సంబంధం పెట్టుకునేందుకు నిరాకరించిందని బాలుడిని తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు."

-దీపక్ కుమార్ శుక్లా, ఎస్పీ

భిలాలా ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని చెప్పారు.

ఇదీ చదవండి:హిందూ మహాసముద్రంలో మునిగిన ఓడ- 17మంది మృతి

ABOUT THE AUTHOR

...view details