తెలంగాణ

telangana

కరోనా పాజిటివ్​ వచ్చిందా- టీకా​ ఎప్పుడు వేయించుకోవాలంటే?

By

Published : Jan 22, 2022, 1:40 PM IST

Booster Dose: కరోనా మహమ్మారి బారిన వారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్‌ షీల్‌ లేఖలు రాశారు.

Booster Dose News
ప్రికాషన్‌ డోసు

Booster Dose: కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి బారిన పడినవారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ వేయాలంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్‌ షీల్‌ లేఖలు రాశారు. కొవిడ్‌ బారిన పడిన వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్‌ డోసు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.

ఎవరైనా కొవిడ్‌ కారణంగా అనారోగ్యం పాలైతే కోలుకున్న నాటి నుంచి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ డోసు వేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. టీకా కార్యక్రమానికి సంబంధించి నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు వెలువరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తన లేఖలో పేర్కొంది.

Booster Dose Rules India: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు 15-18 ఏళ్ల వయసు వారికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసు అందిస్తున్నారు. ఓ వైపు మూడో వేవ్‌ కారణంగా కరోనా కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు సైతం మళ్లీ కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Covid Vaccine: చనిపోయిన మహిళకు రెండో డోసు టీకా!

ABOUT THE AUTHOR

...view details