తెలంగాణ

telangana

'యూపీఏ అసమర్థ పాలన.. ఆ బుక్​తో విస్పష్టం'

By

Published : Nov 23, 2021, 6:24 PM IST

MUMBAI ATTACKS news, bjp on mumbai attacks
ముంబయి ఉగ్రదాడులు ()

2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో(2008 mumbai attacks) యూపీఏ ప్రభుత్వ తీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం(Manish tewari book).. భాజపా, కాంగ్రెస్​ల మధ్య పెను దుమారానికి దారి తీసింది. యూపీఏ ప్రభుత్వ తీరుపై భాజపా తీవ్రంగా మండిపడింది. ఈ పుస్తకం ద్వారా యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి రుజువైందని విమర్శించింది.

కాంగ్రెస్ నేత, ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం(Manish tewari book).. ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారి తీసింది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం(Upa govenment mumbai attacks) దీటుగా స్పందించలేదని ఈ పుస్తకంలో ప్రస్తావించడమే ఇందుకు కారణం. దీనిపై స్పందించిన భాజపా(Bjp on mumbai attacks).. యూపీఏ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడింది. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ దుయ్యబట్టింది.

తివారీ ఆ పుస్తకంలో ఏం రాశారు?

'10 ఫ్లాష్‌ పాయింట్స్‌: 20 ఇయర్స్‌' పేరిట మనీష్‌ తివారీ తాజాగా ఓ పుస్తకాన్ని రాశారు. ఇది డిసెంబర్‌ 2న విడుదలకానుందని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. గడిచిన రెండు దశాబ్దాల్లో భారత జాతీయ భద్రతకు ఎదురైన సవాళ్లపై ఈ పుస్తకాన్ని మనీష్‌ తివారీ రాశారు. యావత్‌ దేశాన్ని వణికించిన ముంబయి దాడుల అనంతరం పరిస్థితులను అందులో ప్రస్తావించారు.

"వందలాది మంది అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదు. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమే.. కొన్ని సందర్భాల్లో మాటలకంటే చేతలతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 26/11 దాడుల ఘటన కూడా అటువంటి సమయమే కాబట్టి, ఆ సమయంలో భారత్‌ ప్రతిస్పందన మరింత బలంగా ఉండాల్సింది."

-మనీష్ తివారీ(తన పుస్తకంలో)

'పుస్తకంతో స్పష్టమవుతోంది'

యూపీఏ ప్రభుత్వం స్పందించిన తీరును మనీష్‌ తివారీ ఈ పుస్తకంలో పరోక్షంగా విమర్శించారు. మనీష్‌ తివారీ తన పుస్తకంలో పేర్కొన్న విషయాలను ప్రస్తావించిన భాజపా(Bjp on mumbai blast).. జాతీయ భద్రత విషయంలో యూపీఏ ప్రభుత్వం ఎంత బలహీనంగా వ్యవహరించిందో స్పష్టంగా అర్థమవుతోందని మండిపడింది. ఈ మేరకు దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆపార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా(Gaurav bhatia) మాట్లాడారు.

"కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎంత బలహీనమైనదో, ఎంత అసమర్థమైనదో తివారీ రాసిన పుస్తకం ద్వారా స్పష్టమవుతోంది. జాతీయ భద్రతను ఆ పార్టీ పట్టించుకోలేదు. పాకిస్థాన్‌పై దీటుగా స్పందించేందుకు అప్పట్లో మన సైన్యానికి ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు? కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈ విషయంపై మౌనం వీడుతారా?"

-గౌరవ్ భాటియా, భాజపా అధికార ప్రతినిధి

2008 నవంబర్‌ 26న పదిమంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడితో ముంబయి నగరం వణికిపోయింది. ఆ మారణహోమంలో దాదాపు 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మూడురోజుల పాటు కొనసాగిన ఆ దాడుల్లో అజ్మల్‌ కసబ్‌ను భారత భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకోగలిగారు. చివరకు కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేశారు.

ఇవీ చూడండి:

సెంట్రల్ విస్టా: ఉపరాష్ట్రపతి కొత్త నివాసానికి లైన్ క్లియర్

సుప్రీంకోర్టు ఎదుట చొక్కా విప్పి.. జడ్జి నిరసన

ABOUT THE AUTHOR

...view details