తెలంగాణ

telangana

భార్యపై అనుమానంతో హత్య.. 2 నెలలుగా వాటర్ ట్యాంక్​లోనే శరీర భాగాలు.. మరో కేసుతో బయటకు..

By

Published : Mar 6, 2023, 12:49 PM IST

భార్యను హత్య చేసి ముక్కముక్కలుగా నరికాడు ఓ భర్త. అనంతరం ఆమె శరీర భాగాలను తన ఇంట్లోని వాటర్ ట్యాంక్​లో దాచిపెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​ జిల్లాలో జరిగింది.

Woman body found in water tank
Woman body found in water tank

ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ జిల్లాలో ఘోరం జరిగింది. భార్యను హత్య చేసి ముక్కముక్కలుగా నరికాడు ఓ భర్త. అనంతరం ఆమె శరీర భాగాలను తన ఇంట్లోని వాటర్ ట్యాంక్​లో దాచిపెట్టాడు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కాగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సకరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది
తఖాత్​పుర్​ గ్రామానికి చెందిన పవన్​ ఠాకూర్​ అనే యువకుడు గీతాంజలి నగర్​లో నివసిస్తున్నాడు. సీసీటీవీ బిగించే పనిచేస్తున్న పవన్​ కొన్నేళ్ల క్రితం సతి సాహు అనే అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే కొన్నాళ్లుగా భార్య సతి సాహు వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేశాడు పవన్​. ఈ అనుమానంతోనే భార్యను హత్య చేయాలని భావించాడు. అందుకోసం ఇద్దరు పిల్లలను రెండు నెలల క్రితం స్వగ్రామంలో విడిచిపెట్టి వచ్చాడు. అనంతరం భార్యను హత్య చేసిన పవన్.. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్​లో దాచిపెట్టాడు.

ఇన్ని రోజులుగా ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్న పవన్​.. ఇటీవలే ఓ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలోనే ఆదివారం అతడి ఇంటికి తనిఖీ కోసం వచ్చారు పోలీసులు. ఇంట్లో అంతా వెతుకుతుండగా పైన ఉన్న వాటర్ ట్యాంక్​లో ఓ మహిళ శరీర భాగాలు పోలీసులకు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్​కు తరలించి విచారణ చేపట్టగా.. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

"ఓ మహిళ శరీర భాగాలు వాటర్ ట్యాంక్​లో లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. అతడి భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం."

---సాగర్​ పాఠక్​, సకరి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్​

మహిళ మృతదేహం లభ్యమైన వాటర్ ట్యాంక్​

హత్యచేసి ముక్కముక్కలుగా
ఆఫ్తాబ్‌ పూనావాలా అనే నిందితుడు తనతో సహజీవనం చేస్తున్న కాలర్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధావాకర్‌ను గతేడాది మే 18న హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 30కిపైగా ముక్కలుగా నరికాడు. అనంతరం కొన్ని రోజులపాటు ఆమె శరీర భాగాలను ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత 18 రోజులపాటు రాత్రివేళ దిల్లీలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు. చివరకు అరెస్టయ్యాడు.

ఇవీ చదవండి :పెళ్లిలో ఫుడ్ పాయిజన్.. రస్​మలాయ్ తిన్న 60 మందికి వాంతులు

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఒక్కటైన జంట!

ABOUT THE AUTHOR

...view details