తెలంగాణ

telangana

'ఎన్నికలు వస్తున్నాయ్​.. విభేదాలకు చెక్​ పెట్టండి'

By

Published : Sep 5, 2020, 8:27 PM IST

అసోంలో మరోమారు ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర నాయకులకు కీలక సూచనలు చేసింది అధిష్ఠానం. నాయకుల మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, బహిరంగంగా విమర్శించుకోవడం మానుకోవాలని ఆదేశించింది.

With eye on Assam polls, BJP asks state leaders to end rifts
'ఎన్నికలు వస్తున్నాయ్​.. గొడవలు ఉంటే సారీలు చెప్పేసుకోండి'

అసోంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది భాజపా. ఎన్నికలు రానున్న తరుణంలో.. రాష్ట్ర నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని, ఇకపై బహిరంగంగా విమర్శలు చేసుకోవడం మానుకోవాలని హైకమాండ్​ ఆదేశించింది. అసోంలోఈ నెల నుంచి అమలు చేయాల్సిన 100 రోజుల కార్యక్రమాన్ని తక్షణమే సిద్ధం చేయాలని సంబంధిత వ్యక్తులకు సూచించింది భాజపా రాష్ట్ర కార్యాలయం.

త్వరలో జరగనున్న బిహార్​, బంగాల్​ ఎన్నికలపై దృష్టి సారించిన భాజపా.. ఇప్పటి నుంచే అసోంపైనా కన్నేసింది. ఎన్నికలు వచ్చే ఏడాదే అయినా.. ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది.

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఆ రాష్ట్ర కేబినెట్​ మంత్రి హిమంత బిస్వా శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భాజపా సూచనలు జారీ చేసినట్లు సమాచారం.​ అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని శర్మ ఇప్పటికే వెల్లడించారు. అయితే శర్మను రాజ్యసభకు ఎన్నిక చేసి.. అక్కడి నుంచే కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని భాజపా అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

సర్బానంద సోనోవాల్, హిమంత బిస్వా శర్మ

సెప్టెంబర్​ 17న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'లోకల్​ ఫర్​ వోకల్'​,'ఆత్మనిర్భర్​ భారత్​','సేవా సప్త్​' వంటి కార్యక్రమాలు చేపట్టనుంది భాజపా. వాటిపైనా మరింత దృష్టిసారించాలని రాష్ట్ర నాయకులకు సూచించిందట కేంద్రం. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు సోనోవాల్​నే​ సీఎం అభ్యర్థిగా ఉంచాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'అసోం భాజపా సీఎం అభ్యర్థిగా మాజీ సీజేఐ జస్టిస్​ గొగొయి'

ABOUT THE AUTHOR

...view details