తెలంగాణ

telangana

'జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఇళ్లకే పరిమితం కావాలి'

By

Published : Mar 21, 2020, 9:01 PM IST

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దీని ద్వారా తమను తాము కాపాడుకోవటమే కాక.. ఇతరులను కూడా రక్షించినట్లవుతుందన్నారు.

Vice president
వెంకయ్య నాయుడు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కొవిడ్​-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం చేపట్టే జనతా కర్ఫ్యూకు మద్దతుగా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలని దేశ ప్రజలను కోరారు వెంకయ్య.

" వైరస్ ఒకరి నుంచి మరొకరికి​ నేరుగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దానిని నివారించేందుకు సామాజిక దూరం పాటించడమే ప్రభావవంతమైన చర్య. దాని ద్వారా తమను తాము కాపాడుకోవటమే కాదు.. ఇతరులను కాపాడినట్లవుతుంది. వైరస్​పై కలిసికట్టుగా పోరాడేందుకు రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పించాలి. ఈ సవాల్​ను ఎదుర్కొనేలా ఇతరులను ప్రోత్సహించటం ప్రతి పౌరుడి బాధ్యత. "

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూను రాజధానిలో పూర్తిగా అమలు చేయలేం'

ABOUT THE AUTHOR

...view details