ETV Bharat / bharat

'జనతా కర్ఫ్యూను రాజధానిలో పూర్తిగా అమలు చేయలేం'

author img

By

Published : Mar 21, 2020, 8:07 PM IST

జనతా కర్ఫ్యూలో భాగంగా దిల్లీని పూర్తిగా నిర్బంధించలేమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​. వైరస్​ ప్రభావం తీవ్రమైతే అప్పుడు లాక్​డౌన్​ చేస్తామని వెల్లడించారు.

No lockdown for now, but will have to do it if needed: Kejriwal
జనతా కర్ఫ్యూను పూర్తిగా అమలు చేయలేం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22) దేశ వ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుపై స్పందించారు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​. దిల్లీ మొత్తం లాక్​డౌన్​ చేయటం కుదరని, అవసరమైతేనే కర్ఫ్యూ విధిస్తామని వెల్లడించారు.

కర్ఫ్యూ విధించడం ద్వారా పేదలపై ఆర్థిక భారం మరింత పడుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించే రేషన్​ బియ్యం వచ్చే నెలలో 50 శాతం ఎక్కువ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 72 లక్షల మంది లబ్ధిదారులకు పెంచిన.. ఈ బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. రోడ్డు మీద జీవించే వారికి, యాచకులకు భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు స్పష్టం చేశారు కేజ్రీవాల్​.

వికలాంగులు, వితంతువులు, వయో వృద్ధులకు ఇచ్చే పింఛను రెట్టింపు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రెట్టింపు​ పింఛన్​ను ఏప్రిల్​ 7న అందజేస్తామని తెలిపిన కేజ్రీవాల్.. దీని ద్వారా​ మొత్తం 8.5 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. మతపరమైన, రాజకీయ సమావేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడదని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దిల్లీలో 50 శాతం బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​ గాయనితో పార్లమెంట్​కు కరోనా సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.