తెలంగాణ

telangana

మూడేళ్లకే 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది

By

Published : Dec 23, 2020, 8:08 PM IST

Updated : Dec 24, 2020, 7:21 AM IST

ఆడుతూ పాడుతూ గడిపే వయసులోనే అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటోంది ఒడిశాకు చెందిన ఓ చిన్నారి. మూడేళ్ల ప్రాయంలోనే ఏకంగా ఇండియా బుక్​ రికార్డ్స్​లో స్థానం దక్కించుకుంది. తన అసాధారణ ప్రతిభతో.. ప్రపంచంలోని 163 దేశాల పేర్లు, సౌర వ్యవస్థ, శరీర అవయవాల పేర్లను ఇట్టే చెప్పేస్తూ.. గిన్నిస్​ రికార్డ్స్​లో చోటే లక్ష్యంగా ముందడుగేస్తోంది. ఆ బాలికపై ప్రత్యేక కథనం...

Three years old girl Sohini creates Indian book of Records with her Incredible talent
ఔరా చిన్నారి! మూడేళ్లకే 163దేశాల పేర్లు ఇట్టే చెప్పేసోంది..

ఔరా చిన్నారి! మూడేళ్లకే 163దేశాల పేర్లు ఇట్టే చెప్పేసోంది..

మూడంటే మూడేళ్లు.. ముద్దు ముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపే వయసది. ఈ ప్రాయంలో అందరిలాగే ఆ చిన్నారి కూడా ఆడుతుంది. అల్లరి చేస్తుంది. అయితే.. ప్రతిభలో మాత్రం అందరికంటే మిన్నగా ప్రదర్శననిస్తూ అబ్బురపరుస్తోంది ఈ ఒడిశా బాలిక. పిన్న వయసులోనే ఏకంగా 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది. అంతే కాదండోయ్​.. మూడేళ్లకే ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో తన పేరును లిఖించుకుని ఔరా అనిపిస్తోంది.

రాష్ట్రానికే కీర్తి..

ఒడిశా రాష్ట్రం ఖుద్రా జిల్లా కైమతియా ప్రాంతంలోని కమలేందు నాయక్​, రంజనా రాణిల కుమార్తె సోహిని దాస్​. మూడేళ్ల వయసులోనే ఈ బాలిక సాధించిన ఘనత.. ఆ రాష్ట్రానికే కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రపంచ పటం లేదా గ్లోబులో ఏ దేశం ఎక్కడుందో.. సంబంధిత జాతీయ జెండాతో సులభంగా గుర్తిస్తోంది సోహిని. ఖండాలు-వాటి పేర్లు, సౌర వ్యవస్థ, శరీరంలోని వివిధ భాగాలు సహా.. మరెన్నో విషయాలను తన ముద్దు పలుకులతో చెప్పేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

తల్లి వల్లే...

అయితే.. ఆమె తల్లి రంజనా రాణి సహకారంతోనే సోహిని ఇంతటి అపారమైన ప్రతిభ కనబరుస్తోందట. ఫ్రాన్స్​లో పరిశోధనలు కొనసాగిస్తున్న రాణి.. భారత్​కు ఇటీవలే వచ్చారు. సోహిని తెలివితేటలను చూశాక ఆమెను మరింత ప్రోత్సహిస్తున్నారు. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో చోటే లక్ష్యంగా ఆమెను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పుకొచ్చారు రాణి.

ఆ చిన్నారి అసాధారణ ప్రతిభకు మురిసిపోతున్న ఆమె తల్లిదండ్రులు.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి

Last Updated :Dec 24, 2020, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details