తెలంగాణ

telangana

'తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్​పై హత్యకేసు'

By

Published : Apr 15, 2020, 6:18 PM IST

కరోనాను అరికట్టే భౌతిక దూరం నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. దేశంలో వైరస్‌ విజృంభణకు కారణమైన తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌పై హత్య కేసు నమోదైంది. ఈయన నిర్వహించిన మతపరమైన సమావేశం కారణంగానే మహమ్మారి వ్యాప్తి చెందిందని దిల్లీ పోలీసులు తెలిపారు.

Tablighi Jamaat chief
దేశంలో వైరస్‌ వ్యాప్తికి కారణమైన తబ్లీగీ జమాత్‌ చీఫ్‌పై హత్యకేసు

తబ్లీగీ జమాత్‌ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు నమోదైంది. జమాతే కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు కరోనా సోకి మృతి చెందారు. ఫలితంగా ఆయనపై ఐపీసీ సెక్షన్-304 ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం విధించిన భౌతిక దూరం నిబంధనలకు వ్యతిరేకంగా మౌలానా సాద్‌.. గత నెల నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో మతపరమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. వీరిలో కొంత మందికి కరోనా ఉండటం వల్ల.. వారి నుంచి దేశ వ్యాప్తంగా హాజరైన అనేక రాష్ట్రాల జమాత్‌ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది.

ఈ ఘటన అనంతరం.. తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు మౌలనా సాద్‌ ప్రకటించారు. ఇప్పటికే ఆయనపై క్వారంటైన్ సమయం పూర్తి కాగా.. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేశారు.

ఇదీ చదవండి:'తబ్లీగీ'ని దాచిన నేత- ఒక్కరి నిర్లక్ష్యానికి ఊరంతటికీ శిక్ష

ABOUT THE AUTHOR

...view details