తెలంగాణ

telangana

పైలట్​ వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్​ వేటు

By

Published : Jul 17, 2020, 11:32 AM IST

Updated : Jul 17, 2020, 12:29 PM IST

రాజస్థాన్​లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సచిన్​ పైలట్ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసింది కాంగ్రెస్. వారి ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రలోభాలకు పాల్పడుతోందని మరోమారు ఆరోపించింది హస్తం పార్టీ.

Rajasthan political crisis: Cong accuses BJP of being involved in horse trading
పైలట్​ వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్​ వేటు

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతోంది. సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో తలొగ్గనివారిపై సస్పెన్షన్‌కు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసింది. భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్రసింగ్‌ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్‌ రద్దు చేసింది. వారిద్దరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

భాజపా ప్రలోభాలు..

అశోక్​ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఈ కుట్రకు సంబంధించి ఎమ్మెల్యే శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా నేత సంజయ్​ జైన్​ల టెలిఫోన్​ సంభాషణలు ఉన్నాయని చెప్పారు. వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

పైలట్​ తిరిగొస్తారని...

శాసనసభ్యుడిగా తనతో సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ సీపీ జోషి ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై రాజస్థాన్‌ హైకోర్టు విచారణ జరపనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు పైలట్‌ పిటిషన్‌పై విచారణ జరగనుండగా.. అనర్హత నోటీసులపై సమాధానం చెప్పాలని అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్‌ విధించిన గడువు కూడా అదే సమయానికి ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోర్టు వరకు తీసుకెళ్లినా సచిన్‌ పైలట్‌కు మాత్రం కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ద్వారా తెరిచే ఉంచినట్లు సమాచారం. పైలట్‌పై తీవ్ర విమర్శలు చేయరాదని సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు సూచించినట్లు తెలిసింది.

ఓ దక్షిణాదినేత పైలట్‌తో సంప్రదింపులు జరపగా.. కాంగ్రెస్‌లో తన రాకకు షరతులు విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను మరిచపోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, పార్టీలో తగిన గౌరవం ఉంటుందని పైలట్‌కు ఆ నేత చెప్పినట్లు సమాచారం.

ఇదీ చూడండి:లద్దాఖ్​లో రక్షణ మంత్రి- క్షేత్రస్థాయి పరిశీలన

Last Updated : Jul 17, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details