తెలంగాణ

telangana

నిర్బంధ కేంద్రంలో ఎలాంటి సదుపాయాలుంటాయో తెలుసా?

By

Published : Mar 15, 2020, 1:26 PM IST

ఇరాన్​ నుంచి స్వదేశానికి చేరుకున్న 234 మంది భారతీయులను రాజస్థాన్​ జైసల్మేర్​లో ఏర్పాటుచేసిన నిర్బంధ కేంద్రానికి తరలించారు అధికారులు. వారి కాలక్షేపం కోసం ఆట వస్తువులను కూడా అందుబాటులో ఉంచారు.

Over 230 Indians evacuated from Iran, quarantined at Army wellness centre in Jaisalmer
ఇరాన్​ నుంచి వచ్చినవారు రాజస్థాన్ నిర్బంధ కేంద్రానికి..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది భారత్​. ఈ నేపథ్యంలో ఇరాన్​లో ఉన్న 234 మంది భారతీయులను రెండు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిని రాజస్థాన్​లోని జైసల్మేర్​ వద్ద సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు వెల్లడించారు అధికారులు. వీరిలో 131 మంది విద్యార్ధులు, 103 మంది ఆధ్యాత్మిక పర్యటకులు ఉన్నారు. వీరిని 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచనున్నారు.

అన్ని సదుపాయాలతో ప్రత్యేక శిబిరం..

జైసల్మేర్​ నిర్బంధ కేంద్రాన్ని పూర్తి వైద్య సదుపాయాలతో సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. నిర్బంధ కేంద్రంలో ఉన్నవారి కాలక్షేపం కోసం చదరంగం, క్యారమ్స్​ వంటి ఆటవస్తువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

పడకలు
సిద్ధం చేసిన పడకలు
వంట గది
చదరంగం, క్యారమ్స్​ క్రీడల ఏర్పాటు

ఇటలీ నుంచి 218 మంది...

ఇటలీ నుంచి 218 మంది భారతీయులు ఈ రోజు ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:భారత్​లో 107కు చేరుకున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details