తెలంగాణ

telangana

లాక్​డౌన్​ 3.0పై నేడు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం!

By

Published : May 2, 2020, 6:34 AM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న వేళ లాక్​డౌన్​ను మరో రెండు వారాల పాటు పొడిగించింది కేంద్రం. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ 3.0పై ప్రధాని మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది.

MODI LIKELY TO SPEAK TO THE NATION ABOUT LOCKDOWN EXTENSION
లాక్​డౌన్​ 3.0పై నేడు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం!

దేశంలో మరోసారి లాక్​డౌౌన్​ పొడగించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. ఈ దఫా లాక్​డౌన్​లో దేశ ప్రజలు పాటించాల్సిన నిబంధనలపై పలు కీలక విషయాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

కరోనాపై పోరులో భాగంగా ఈ నెల 3తో లాక్​డౌన్​ 2.0 గడువు ముగియనుంది. అయితే దేశంలో వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తునట్టు శుక్రవారం ప్రకటించింది కేంద్రం.

ఈసారి జోన్ల ఆధారంగా లాక్‌డౌన్‌పై సడలింపులు ఇచ్చింది కేంద్రం. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమాన, రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను కేంద్రహోంశాఖ నిర్దేశించింది.

ఇదీ చూడండి-లాక్​డౌన్ 3.0: ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ఓకే

ABOUT THE AUTHOR

...view details