తెలంగాణ

telangana

దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

By

Published : Aug 5, 2019, 1:18 PM IST

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు 29 రాష్ట్రాల సమ్మిళితంగా ఉన్న భారత్.. 28 రాష్ట్రాలతో కూడిన దేశంగా మారనుంది.

దేశంలో ఇకపై 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

భారత్​ 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన దేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అంకెలు. ఇక నుంచి దేశ చిత్రపటంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెక్కలు మారనున్నాయి. జమ్ముకశ్మీర్ ను విభజిస్తూ ప్రధాని నరేంద్రమోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇక నుంచి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన భారతదేశం దర్శనమివ్వనుంది.

జమ్ముకశ్మీర్ రాష్ట్రం సర్కారు తాజా నిర్ణయంతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందనుంది. దిల్లీ, పుదుచ్చేరి తరహాలో జమ్ముకశ్మీర్... శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. లద్ధాఖ్ ప్రాంతం మాత్రం చండీఘడ్​లా అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండనుంది.

ఇదీ చూడండి:370, 35ఏ రద్దు... కశ్మీర్ ఇక అందరితో సమానమే

Intro:Body:

W


Conclusion:

ABOUT THE AUTHOR

...view details