తెలంగాణ

telangana

అతిపెద్ద చంద్రుడి ఫొటోను చిత్రీకరించిన మామ్

By

Published : Jul 4, 2020, 4:50 AM IST

Updated : Jul 4, 2020, 5:29 AM IST

అంగారకుడికి దగ్గరలో ఉన్న అతిపెద్ద చంద్రుడి ఫొటోనూ చిత్రీకరించింది ఇస్రో ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌(మామ్​). జులై 1న ఈ ఫొటోను తీసింది. ఇస్రో తమ ట్విట్టర్‌ ఖాతాలో ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసింది.

ISRO's MOM captures image of the biggest moon of Mars
అతిపెద్ద చంద్రుడి ఫొటోను చిత్రీకరించిన మామ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్)‌లోని కలర్‌ కెమెరా....అంగారకుడికి దగ్గరలో ఉన్న అతిపెద్ద చంద్రుడైన ఫోబోస్‌ను చిత్రీకరించింది. అంగారకుడికి 7వేల 200 కిలోమీటర్లు, ఫోబోస్‌కు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జులై 1న ఈ ఫొటోను తీసింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని ఇస్రో తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఫోబోస్‌ ఎక్కువగా కార్బోనాసియస్‌ కోన్‌డ్రైట్స్‌తో తయారు అవుతుందని ఇస్రో తెలిపింది. ఫోబోస్‌లోని అతిపెద్ద బిలం స్టిక్నీని కూడా ఇస్రో ఈ చిత్రంలో మార్క్‌ చేసింది.

ఇదీ చూడండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'

Last Updated : Jul 4, 2020, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details