తెలంగాణ

telangana

దేశవ్యాప్తంగా ఐటీ దాడులు- భారీగా నగదు జప్తు

By

Published : Oct 27, 2020, 12:34 PM IST

దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్​ పేరుతో డబ్బును అక్రమంగా సృష్టిస్తున్న పలువురి ఇళ్లల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారీగా నగదు, ఆభరణాలను జప్తు చేసింది.

I-T dept conducts raids at entry operation racket, recovers cash, jewellery worth crores
42 ప్రాంతాల్లో ఐటీ దాడులు- భారీగా నగదు జప్తు

ఎంట్రీ ఆపరేషన్​ రాకెట్​తో డబ్బు సంపాదిస్తున్న పలువురి నివాసాలపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో రూ. 2.37కోట్ల నగదు, రూ. 2.98కోట్లు విలువ చేసే ఆభరణాలను జప్తు చేసింది.

భారీగా నగదు స్వాధీనం
ఐటీ దాడులు- భారీగా నగదు జప్తు

దిల్లీ-ఎన్​సీఆర్​, హరియాణా, పంజాబ్​, ఉత్తరాఖండ్​, గోవాతో పాటు మొత్తం 42 ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టినట్టు సీబీడీటీ(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) వెల్లడించింది. షెల్​ కంపెనీలను ఏర్పాటు చేసి లెక్కల్లోకి రాని ధనాన్ని సృష్టించి నకిలీ బిల్లుల ద్వారా వాటిని ఈ ఆపరేట్లు ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంది. అనంతరం వీటిని రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడులుగా పెట్టినట్లు స్పష్టం చేసింది.

ఐటీదాడుల్లో బయటపడ్డ సొమ్ము
ఐటీదాడుల్లో బయటపడ్డ సొమ్ము

ఇదీ చూడండి:-ఉల్లి బస్తాల చోరీ- నిందితుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details