తెలంగాణ

telangana

'మహా'లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Aug 5, 2020, 6:27 PM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబయి సహా పాల్​ఘర్​​, ఠాణె జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. రహదారులు, రైల్వే ట్రాక్​లపై నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

Heavy rain in Mumbai region; rail, road transport affected
'మహా'లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

మహారాష్ట్రలోని ముంబయి, పాల్​ఘర్, ఠాణె సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. పంచగంగా నదిపై ఉన్న రాజారామ్​ డ్యామ్ నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటేసింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కొల్హాపుర్​ జిల్లా అధికారులు హెచ్చరించారు.

నిలిచిపోయిన ట్రాఫిక్​

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులు, రైల్వే ట్రాక్​ల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు

ప్రచండ గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు అధికారులు.

'మహా'లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఓ గుడిని చుట్టుముట్టిన వరద

ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు స్పందన దళాలను(ఎన్‌డీఆర్‌ఎఫ్​) ఠాణె, పాల్​ఘర్ జిల్లాల్లో మోహరించినట్లు అధికారులు చెప్పారు.

ఇదీచూడండి:రామాలయానికి వెంకయ్య కుటుంబం విరాళం

ABOUT THE AUTHOR

...view details