తెలంగాణ

telangana

'అర్ధరాత్రి దహనం మానవ హక్కుల ఉల్లంఘనే'

By

Published : Oct 14, 2020, 12:00 AM IST

హాథ్రస్​ కేసులో పోలీసులు, అధికారుల తీరును తప్పుబట్టింది అలాహాబాద్​ హైకోర్టు. సామూహిక అత్యాచారానికి గురై, మరణించిన బాధితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి దహనం చేయడాన్ని మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది.

Hathras woman's late-night cremation violation of human rights: HC
'అర్ధరాత్రి దహనం చేయడం మానవహక్కుల ఉల్లంఘనే'

హాథ్రస్​ కేసులో వివాదాస్పద రీతిలో వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది అలహాబాద్​ హైకోర్టు. అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆచారాలకు విరుద్ధంగా హడావుడిగా అర్ధరాత్రి దహన సంస్కారాలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇలా చేయడాన్ని మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యుల హక్కులను కూడా ఉల్లంఘించినట్లేనని తెలిపింది.

ఘటనకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచి.. రాజకీయ పార్టీలు, మీడియాను అనుమతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు లఖ్​నవూ బెంచ్​. నవంబరు 2న జరగనున్న విచారణకు సస్పెండ్​ అయిన హాథ్రస్​ ఎస్​పీ విక్రాంత్​ వీర్​ను హాజరవ్వాలని ఆదేశించింది.

హాథ్రస్​ లాంటి ఘటనల్లో దహన సంస్కారాలకు పద్ధతులను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఈ మేరకు 11 పేజీల ఉత్తర్వులను అధికారిక వైబ్​సైట్​లో పొందిపరిచింది.

ఇదీ చూడండి:బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!

ABOUT THE AUTHOR

...view details