తెలంగాణ

telangana

'వలస కూలీల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపాలి'

By

Published : May 18, 2020, 10:30 PM IST

Updated : May 19, 2020, 6:28 AM IST

వలస కూలీలకు మద్దతుగా రాజ్​ఘాట్​ వద్ద ధర్నాకు దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను.. దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసనకు దిగారు.

Yashwant Sinha
యశ్వంత్ సిన్హా

వలస కార్మికులకు సాయం చేసేందుకు సైన్యాన్ని ఉపయోగించాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఈ మేరకు దిల్లీలోని రాజ్​ఘాట్​ వద్ద ఆమ్​ ఆద్మీ నేతలు సంజయ్​ సింగ్​, దిలీప్ పాండేతో కలిసి ధర్నా నిర్వహించారు.

అయితే లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి నిరసన చేపట్టినందుకు ఆయనను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

వలస కూలీలను ఆదుకోవటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని యశ్వంత్ విమర్శించారు. ఫలితంగా చాలా మంది నడకదారిన వందలాది కిలోమీటర్లు ప్రయాణించారని.. ఈ ప్రక్రియలో కొంతమంది మరణించినట్లు పేర్కొన్నారు.

యశ్వంత్ సిన్హాతో ఇంటర్వ్యూ

"కరోనా లాక్​డౌన్​ వల్ల లక్షలాది మంది వలసకూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు సరిపోవు. వాళ్ల గురించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. వాళ్లపై శ్రద్ధ పెట్టలేదు. ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో ఇళ్లకు పంపించేది. దేశంలో 20 వేల రైళ్లు ఉన్నాయి. ఒక్కసారి 2.3 కోట్ల మందిని తరలించవచ్చు."

- యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపైనా స్పందించారు యశ్వంత్​. ఈ ప్యాకేజీతో వలస కూలీలకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. భాజపాది పేదవారి వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. విదేశాల నుంచి తరలించేందుకు తీసుకున్న శ్రద్ధ కూలీలపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని చర్యలు తీసుకోవటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

"ఈ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. అవసరమైతే సైనికులను రంగంలోకి దింపి వారికి సాయం అందించాలి. గౌరవంగా ఇంటికి సాగనంపాలి. అక్కడ వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి."

- యశ్వంత్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి

Last Updated : May 19, 2020, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details