తెలంగాణ

telangana

దేశీయ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ ఆమోదం

By

Published : Apr 24, 2020, 6:41 AM IST

దేశంలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. ఎక్కువమందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా 'రియల్​ టైమ్​ పీసీఆర్​ బేస్డ్​ టెస్ట్​ డయాగ్నోస్టిక్​ ఆసే' విధానానికి ఐసీఎంఆర్​ ఆమోదం లభించింది. దీంతో తక్కువ ధరలోనే కరోనా పరీక్షలు నిర్వహించే వీలుంది.

Govt goes for spending curbs to mobilise funds for Covid-19 fight
దేశీయ కొవిడ్‌ పరీక్షకు ఐసీఎంఆర్‌ ఆమోదం

చౌకలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన వినూత్న విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించింది. ఇది 'రియల్‌ టైమ్‌ పీసీఆర్‌ బేస్డ్‌ డయాగ్నోస్టిక్‌ ఆసే' విధానం. ఈ ప్రక్రియకు ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి సాధించిన తొలి విద్యా సంస్థగా ఐఐటీ దిల్లీ గుర్తింపు పొందింది. ఫలితాల్లో భారీ వైరుధ్యం వస్తున్న కారణంగా చైనా తయారీ కిట్ల ద్వారా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్‌ నిలిపివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

తాము రూపొందించిన విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ పేర్కొంది. మానవుల్లో ఉండే ఇతర కరోనా వైరస్‌లలో లేని కొన్ని ప్రత్యేకతలను కొవిడ్‌-19 కారక వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏలో గుర్తించినట్లు తెలిపింది. వీటిని లక్ష్యంగా చేసుకొని రోగ నిర్ధారణ చేసే విధానాన్ని తాము అభివృద్ధి చేశామని వివరించింది.

ఇదీ చదవండి:వైరస్​లతో నష్టాలే కాదు... లాభాలూ ఉన్నాయ్​!

ABOUT THE AUTHOR

...view details