తెలంగాణ

telangana

ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

By

Published : Aug 22, 2020, 4:11 PM IST

రాజస్థాన్​లో ఇమ్యూనిటీ పెంచే ఆయుర్వేద గణపతి విగ్రహాలు సందడి చేస్తున్నాయి. కరోనా వేళ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో వినాయక విగ్రహాలను రూపొందించాడు ఓ కళాకారుడు. ఈ పర్యావరణహిత గణేశులను నిమజ్జనం చేయనవసరం లేకుండా ఆ దినుసులతో కషాయం చేసుకోవచ్చు అంటున్నాడు.

Ganapati idol made of spices is the new catch in this Ganesh Chaturthi
ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

కరోనా కాలంలో వినాయక చవితి పండుగను ఆరోగ్యమయం చేసే ఆలోచన చేశాడు రాజస్థాన్​కు చెందిన ఓ కళాకారుడు. గణనాథుడి విగ్రహాలతోనే రోగ నిరోధక శక్తిని అందించే ఉపాయం చేశాడు. సుగంధ ద్రవ్యాలతో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!
ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

జైపుర్​కు చెందిన శివచరణ్ యాదవ్ ఏటా విత్తనాలు, ఆవు పేడ వంటి ప్రకృతి పదార్థాలతో పర్యావరణహిత వినాయకులను తయారుచేసేవాడు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వినాయకులకు డిమాండ్ తగ్గింది. దీంతో, కొవిడ్​కు భయపడకుండా, భక్తులకు ఉపయోగపడే విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు శివచరణ్. అందుకే, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, పసుపు వంటి సుగంధద్రవ్యాలతో వినాయకుడిని రూపొందించాడు.

ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

అయితే, ఈ సుగంధ ద్రవ్యాల గణనాథులను పూజించి.. నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద గుణాలున్న మసాలా దినుసులను భద్రపరచుకుని, రోజూ కషాయం చేసుకుని తాగితే కరోనా పరారే అంటున్నాడు శివచరణ్.

"రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద పదార్థాలతో గణేశులను తయారు చేశాం. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు కషాయం తీసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ ఆలోచన చేశాం. ఈ సారి, మట్టి వినాయకులకు కూడా డిమాండ్​ తక్కువగా ఉంది. అందుకే, మసాలాలతో దాదాపు 20 ఎకో- ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేశాం. "

-శివచరణ్, కళాకారుడు

ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

ఇదీ చదవండి:కనిపించని గణేశ్​ చతుర్థి శోభ.. ఆలయాల్లోనే పూజలు!

ABOUT THE AUTHOR

...view details