తెలంగాణ

telangana

రూ.8,722 కోట్ల 'సైనిక' కొనుగోళ్లకు ఆమోదం

By

Published : Aug 12, 2020, 5:52 AM IST

Updated : Aug 12, 2020, 7:52 AM IST

8,722 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వైమానిక దళానికి 106 ప్రాథమిక శిక్షణ విమానాలను సమాకూర్చడం వంటివి వీటిలో ఉన్నాయి.హెచ్‌టీటీ-40గా పిలిచే శిక్షణ విమానాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది.

DAC approves procurement worth Rs 8,722.38 crore, including 106 Basic Trainer Aircraft for IAF
రూ.8,722 కోట్ల ‘సైనిక’ కొనుగోళ్లకు ఆమోదం

సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే క్రమంలో రూ.8,722 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణశాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వాయుసేనకు 106 ప్రాథమిక శిక్షణ విమానాలను సమకూర్చడం వంటివి ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని జరిగిన డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డాక్‌) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు అధికారులు వెల్లడించారు.

హెచ్‌టీటీ-40గా పిలిచే శిక్షణ విమానాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది.

ఇదీ చూడండి: 'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం'

Last Updated : Aug 12, 2020, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details