తెలంగాణ

telangana

'మహా'పై కరోనా పంజా.. ఒక్కరోజులో 3,890మందికి వైరస్​

By

Published : Jun 24, 2020, 7:33 PM IST

Updated : Jun 24, 2020, 8:37 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఒక్కరోజులో 3,890 మందికి వైరస్ సోకింది. 24 గంటల వ్యవధిలో 208 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 1,42,900కు చేరగా.. ఇప్పటివరకు 6, 739 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోనూ వైరస్ విజృంభణ ఎక్కువగా ఉంది. కొత్తగా 2,865 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 67,468మంది కరోనా బాధితులుగా మారారు.

india cases
తమిళనాడులో కొత్తగా 2865మందికి వైరస్

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​, రాజస్థాన్​లో ఉద్ధృతి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 3,890 మందికి వైరస్ సోకగా.. 208మంది బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,42,900 మందికి కరోనా సోకింది. మొత్తం 6,739 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో కొత్తగా 2,865 మందికి వైరస్..

తమిళనాడులో ఒక్కరోజులో 33 మంది వైరస్​తో మృతి చెందారు. 2,865 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 67,468 మంది వైరస్ బారినపడగా.. మరణాల సంఖ్య 866కు చేరింది.

గుజరాత్​లో ఒక్కరోజులో 572మందికి..

గుజరాత్​లో కొత్తగా 25మంది వైరస్​కు బలయ్యారు. 572మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 29,001 మంది వైరస్ బాధితులుగా మారగా.. 1,736 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,169 యాక్టివ్ కేసులు ఉండగా.. 21,096మందిలో వైరస్ నయమైంది. అహ్మదాబాద్ నగరంలోనూ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ కొత్తగా 215మంది మహమ్మారి బారినపడగా.. బాధితుల సంఖ్య 19,601కి చేరింది. నగరంలో కొత్తగా 15 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మృతుల సంఖ్య 1,378కి పెరిగింది.

దిల్లీలో 64 మంది మృతి..

దిల్లీలో కొత్తగా 3,788 మంది వైరస్ బారినపడ్డారు. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా దిల్లీలో బాధితుల సంఖ్య 70,390కి చేరింది. 2,365 మంది ఇప్పటివరకు మరణించారు.

కేరళలో కేసుల రికార్డు..

కేరళలో రికార్డు స్థాయిలో 152 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మొత్తంగా 3,603 మందికి వైరస్ సోకగా.. ప్రస్తుతం 1,691 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో వరుసగా ఆరో రోజు 100కు పైగా కేసులు నమోదయ్యాయి.

కర్ణాటకలో 397మందికి..

కర్ణాటకలో కొత్తగా 397 మంది వైరస్ బాధితులుగా మారగా.. 14మంది మహమ్మారికి బలయ్యారు. వైరస్ బాధితుల సంఖ్య 10,118గా ఉండగా.. 164మంది వైరస్​తో మృతి చెందారు. అయితే ఇప్పటివరకు 6,151మందికి వైరస్ నయమయింది.

పంజాబ్​లో..

పంజాబ్​లో కొత్తగా 230మందికి వైరస్ నిర్ధరణ అయింది. మొత్తంగా కేసుల సంఖ్య 4627కు పెరిగింది. ఇప్పటివరకు 113మంది వైరస్​కు బలయ్యారు. 3099మందికి వైరస్ నయమైంది.

ఇదీ చూడండి:కరోనా టెస్టుల్లో కొత్త రికార్డ్- ఒక్కరోజే 2 లక్షలు

Last Updated :Jun 24, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details