కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించి, బాధితులకు సమర్థమైన చికిత్స అందించడమే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
మంగళవారం ఒక్కరోజే 2,15,195 మందిని పరీక్షించగా.. జూన్ 23నాటికి దేశవ్యాప్తంగా 73,52,911 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
3 లక్షలకు పెంచే దిశగా..
ఒక్కరోజు పరీక్షల సామర్థ్యాన్ని 3 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ(730), ప్రైవేటు(270) రంగాల్లో మొత్తం 1000 ల్యాబ్‌లకు అనుమతిచ్చినట్లు వెల్లడించింది. వైరస్ పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకూ సూచించింది ఐసీఎంఆర్.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,56,183 మంది వైరస్ బారిన పడగా... 14,176 మంది కరోనాతో మరణించారు.
ఇదీ చూడండి: మైనర్‌కు 66 ఏళ్ల బాషా ప్రేమలేఖ- చివరకు...