తెలంగాణ

telangana

'రాహుల్​... పాక్​ చెబుతోంది, ఇకనైనా నమ్మండి'

By

Published : Oct 29, 2020, 3:21 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ విషయమై తాజాగా పాక్​ చట్టసభ్యుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‌

Nadda
'రాహుల్​... పాక్​ చెబుతోంది, ఇప్పటికైనా నమ్మండి'

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ విషయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా గజగజ వణికారని ఆ దేశ పార్లమెంట్​ సభ్యుడు ఇటీవల స్వయంగా వెల్లడించారు. అయితే సదరు వీడియోను ఉద్దేశిస్తూ కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని విమర్శించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.

"భారత్​, దేశ సైన్యం, ప్రభుత్వం, పౌరులు ఇలా ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్​ యువరాజు (రాహుల్​ గాంధీ) నమ్మరు. ఆయన ఎంతగానో నమ్మే ఆ దేశానికి (పాక్​) సంబంధించిన వ్యక్తి ఏం చెబుతున్నారో చూడండి. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరుస్తారేమో!"

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

రాహుల్​ గాంధీ 2019 లోక్​సభ ఎన్నికల ప్రచారంలో దేశ సైన్యాన్ని బలహీనపరిచేలా ఎన్నో వ్యాఖ్యలు చేశారని నడ్డా ఆరోపించారు. భారత సైన్యం ధైర్యాన్నీ, శక్తిని ప్రశ్నించారన్నారు. వాయుసేనకు రఫేల్​ విమానాలు అందకుండా ఉండాలని రాహుల్ ఎన్నో అడ్డంకులు సృష్టించారని నడ్డా విమర్శించారు. ఆ పన్నాగాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, కాంగ్రెస్​కు ఘోర ఓటమి మిగిలిందని నడ్డా అన్నారు.

వీడియోలో ఏముంది?

2019, ఫిబ్రవరిలో భారత్​- పాక్​ మధ్య జరిగిన వైమానిక ఘర్షణలో దాయాది దేశానికి చిక్కారు మన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్థమాన్. అయితే ఆయన్ను పాక్​ ఎలా విడుదల చేయాల్సి వచ్చింది.. అనే విషయాన్ని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ ఆ దేశ పార్లమెంట్​లో ఇటీవల వెల్లడించారు.

"ఫిబ్రవరి 2019 నాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిరాకరించారు. ఈలోగా పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ బాజ్వా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతున్నాయి.. శరీరమంతా చెమటలు పట్టి ఉంది. చర్చల అనంతరం పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మెహ్‌మూద్‌ ఖురేషీ.. "మీకు పుణ్యముంటుంది.. అభినందన్‌ను వెళ్లనీయండి .. లేదంటే భారత్‌ రాత్రి 9 గంటలకు మనమీద దాడి చేసేందుకు సిద్ధమవుతోంది" అన్నారు."

-అయాజ్‌ సాదిక్‌, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) నేత

ABOUT THE AUTHOR

...view details