తెలంగాణ

telangana

ఆపరేషన్​ కరోనా: ఇరాన్​ నుంచి భారత్​కు మరో 275 మంది

By

Published : Mar 29, 2020, 8:54 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకుపోయిన 275 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అధికారులు. ఇరాన్​ నుంచి ఇప్పటికే వచ్చిన 277 మంది ఇదే కేంద్రంలో ఉన్నారు.

iran
ఇరాన్

ఇరాన్​లో చిక్కుకుపోయిన 275మంది భారతీయులు ప్రత్యేక విమానంలో స్వదేశం చేరుకున్నారు. రాజస్థాన్​ జోధ్​పుర్​లో దిగిన వీరందరినీ భారత సైన్యం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రానికి తరలించారు అధికారులు. ఇప్పటికే 277మంది ఇరాన్​ నుంచి వచ్చిన భారతీయులు ఇదే ఆరోగ్య కేంద్రంలో నిర్బంధంలో ఉన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశం రప్పిస్తున్నారు అధికారులు. ఇరాన్, ఇటలీ నంచి వందలాది మందిని ఇప్పటికే తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:'టీ3' వ్యూహంతో కరోనా మహమ్మారిపై త్రిముఖ పోరు

ABOUT THE AUTHOR

...view details